Breaking News

చిరంజీవిని గుర్తు చేసుకున్న భార్య.. ఎమోషనల్ పోస్ట్!

Published on Thu, 10/17/2024 - 19:26

కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు చిరంజీవి సర్జా. నాలుగేళ్ల క్రితం ఆయన ఆకస్మిక మరణంతో శాండల్‌వుడ్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అదే సమయంలో ఆయన భార్య ఐదు నెలల గర్భవతి కావడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా కన్నడ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు.

అయితే ఇవాళ చిరంజీవి సర్జా జయంతి కావడంతో ఆయన భార్య మేఘన భర్తను గుర్తు చేసుకుంది. నా జీవితంలో నువ్వే మార్గదర్శకమని భర్తతో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు తమ హీరోను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నారు. కాగా.. ఇటీవల ఆయన సోదరుడు ధృవ సర్జా నటించిన మార్టిన్ చిత్రం థియేటర్లలో విడుదలైంది. విడుదల సమయంలో అన్నకు ప్రత్యేకంగా నివాళి అర్పించాడు.

కాగా.. 2009లో సినిమారంగంలోకి ప్రవేశించిన స్టార్ హీరో చిరంజీవి సర్జా దాదాపు 22 చిత్రాల్లో నటించారు. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా నటించిన చివరి చిత్రం 'రాజమార్తాండ'.  అయితే ఊహించని విధంగా ఈ కన్నడ స్టార్ జూన్ 7, 2020న 39 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయే ముందు  కూడా సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆయన మరణం తర్వాత తమ్ముడు ధృవ సర్జా అన్న పాత్రకు డబ్బింగ్ చెప్పారు.  
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)