Breaking News

కమల్‌ చిత్రంలో లేడీ సూపర్‌ స్టార్‌

Published on Thu, 03/23/2023 - 07:07

విశ్వనటుడు కమలహాసన్‌ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార నటించబోతున్నట్లు తాజా సమాచారం. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన మూడు, నాలుగు చిత్రాలలో నటించిన నయనతార ఇప్పటి వరకు కమలహాసన్‌కు జంటగా నటించలేదు. అయితే ఇప్పుడు నటించబోతున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతుండొచ్చు. దీనికి కాదనే బదులే వస్తుంది. అయితే కమలహాసన్‌ నిర్మించనున్న చిత్రంలో నయనతార ప్రధాన పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

నటుడు కమలహాసన్‌ ఓ పక్క కథానాయకుడిగా నటిస్తునే మరో పక్క ఇతర నటులతో తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై చిత్రాలు నిర్మించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆ విధంగా విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అజిత్‌ 62వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి విఘ్నేష్‌ శివన్‌ సుమారు రెండేళ్లు కష్టపడ్డాడు. అయితే చివరి క్షణంలో ఆ చిత్రం నుంచి తొలగించారు. అలాంటి సమయంలో నటుడు కమలహాసన్‌ అండగా నిలిచారని సమాచారం. నయనతార కథానాయకిగా లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రాన్ని విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో కమలహాసన్‌ నిర్మించతలపెట్టినట్టు తెలుస్తోంది.

మరో విషయం ఏంటంటే ఇంతకుముందు ఈ చిత్రాన్ని లవ్‌ టుడే చిత్రం ప్రేమ్‌ ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు సీన్‌ మారింది. దీనికి విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించనున్నారట. నయనతార ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రంలో ప్రదీప్‌ రంగనాథన్‌ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు, ఆయనకు జంటగా మరో యువ నటి నటించిన సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా నయనతార ఇప్పటికే తన 75వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)