ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు
Breaking News
హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
Published on Mon, 04/06/2026 - 15:40
మలయాళ హీరోయిన్ మంజు వారియర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని పాలక్కాడ్‌లో ఓ ఈవెంట్‌కు హాజరైన మంజు వారియర్‌ను ఓ మహిళా అభిమాని బలవంతంగా ముద్దు పెట్టుకుంది. అది చూసిన అక్కడి యాంకర్ ఇలా ప్రవర్తించడం సరికాదని విమర్శించింది. అయితే సదరు మహిళ మాత్రం.. నాకు మంజు అక్క అంటే చాలా ఇష్టం.. అందుకే ముద్దు పెట్టుకున్నా అని బదులిచ్చింది.
ఓపికగా సెల్ఫీలు
ఇంత జరిగినప్పటికీ మంజు వారియర్ కోపగించుకోలేదు. ఎంతో సహనంతో మిగతా అభిమానులతో సరదాగా మాట్లాడుతూ వారితో సెల్ఫీలు దిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంజు వారియర్ విషయానికి వస్తే.. ఈమె నటి మాత్రమే కాదు. డ్యాన్సర్, రైటర్, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్ కూడా! సాక్ష్యం అనే మలయాళ చిత్రంతో కథానాయికగా వెండితెరపై అరంగేట్రం చేసింది.
సినిమా
ఈ పుళయం కాదన్ను, అసురన్, పాత్రం, కలియట్టం ఇలా అనేక సినిమాలు చేసింది. కన్నెళుతి పొట్టుం తొట్టు (1999) చిత్రానికిగానూ జాతీయ అవార్డు పొందింది. అయితే ఈ సినిమా తర్వాత బ్రేక్ తీసుకుంది. హౌ ఓల్డ్ ఆర్ యూ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. చివరగా ఎల్ 2: ఎంపురాన్ చిత్రంలో కనిపించింది. చతుర్ముఖం చిత్రంతో నిర్మాతగా మారింది. సల్లాపం అనే పుస్తకం రాసి తనలో రచయిత్రి కూడా దాగి ఉందని నిరూపించింది. అలాగే ఈమెకు వీణ వాయించడం కూడా వచ్చు.
A lady fan kissed Malayalam Actress #ManjuWarrier in a public function 🤯 pic.twitter.com/y1PAFXZUju
— 000009 (@ui000009) April 6, 2026
చదవండి: పెద్దిలో ఐటం సాంగ్.. భలే తప్పించుకుందే!
Tags : 1