Breaking News

రూ. 200 కోట్లు నష్టం.. రెమ్యునరేషన్‌ కూడా రిటర్న్‌: ఆమిర్‌ఖాన్‌

Published on Sun, 09/14/2025 - 11:02

లాల్‌ సింగ్‌ చడ్డా చిత్రంతో రూ. 200 కోట్టు నష్టాలను ఎదుర్కొన్నట్లు తాజాగా ఆమిర్‌ఖాన్‌ చెప్పారు . 2022లో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి ఆమిర్‌, అతడి మాజీ భార్య కిరణ్‌రావ్‌ సహ నిర్మాతలుగా వ్యవహరించారు.  ఈ సినిమాకు ముందు ఆమీర్‌ నటించిన ప్రతి సినిమా మినిమమ్‌ రూ. 150 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టాయి. అయితే, లాల్‌ సింగ్‌ చడ్డా మూవీకి వచ్చిన నష్టాల గురించి తాజాగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

'ఒక నిర్మాతగా బడ్జెట్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఏదైనా సినిమా ప్రారంభిస్తే లాభాల కంటే నష్టాలు రాకుంటే చాలు అనే విధంగా నా ప్రణాళిక ఉంటుంది. కానీ, లాల్‌ సింగ్‌ చడ్డా మూవీ బడ్జెట్‌ విషయంలో పొరపాటు చేశాను. వరుస విజయాలు నాకు దక్కడం వల్ల ఈ మూవీ విషయంలో కాస్త అతి నమ్మకం ఏర్పడింది. దీంతో బడ్జెట్‌పై ఎలాంటి పరిమితులు పెట్టుకోలేదు. అందుకే నష్టపోయాను.  దంగల్‌ సినిమాకు రూ. 390 కోట్లు ఇండియాలోనే వచ్చాయి. దీంతో లాల్‌ సింగ్‌ చడ్డాకు రూ. 200 కోట్లు వస్తాయని అంచనా పెట్టుకున్నాను. అదే నేను చేసిన పొరపాటు.

ఒక సినిమా రూ. 120 కోట్లు చేస్తుందని అనుకుంటే అప్పుడు మీ బడ్జెట్‌ రూ. 80 కోట్లు దాటకూడదు. ఇలా ప్లాన్‌ ఉంటే సేఫ్‌గా ఉంటాం. ఇలాంటి ప్రణాళిక లాల్‌ సింగ్‌ చడ్డా సమయంలో చేయలేదు. దీంతో రూ. 200 కోట్ల నష్టాన్ని ఎదుర్కొన్నాం. ఈ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో కరోనా ప్రభావం ఉండటంతో ఎక్కువగా ట్రావెలింగ్‌కు ఖర్చు అయింది.  చైనాలో  తెరకెక్కించిన ఒక భారీ సీన్‌ ...  ఎడిటింగ్‌లో తొలగించాం. ఆ ఖర్చు అంతా బుడిదలో పోసిన పన్నీరు అయిపోయింది.' అని అన్నారు.

ఈ సినిమాకుగానూ ఆమిర్‌ రెమ్యూనరేషన్‌ రూ.50కోట్లు తీసుకున్నాడు. అయితే, ఆ మొత్తం సొమ్ముని వదులుకుని తన సహ నిర్మాతలకు తిరిగిచ్చేశారు. వారికి నష్టాన్ని తగ్గించాలనుకునే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఆమిర్‌ భారీగానే నష్టపోయారు.  ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ బాక్సాఫీస్‌ వద్ద రూ.70 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఈ చిత్రంలో కరీనాకపూర్‌ హీరోయిన్‌గా నటించగా ప్రముఖ తెలుగు నటుడు నాగచైతన్య కీలకపాత్రలో కనిపించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)