Breaking News

‘ఎల్2: ఎంపురాన్’ మూవీ రివ్యూ

Published on Thu, 03/27/2025 - 13:12

మోహన్‌లాల్‌(mohalal) సినిమాలకు మాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచి ఆదరణ ఉంటుంది. ఆయన నటించిన చిత్రాలన్నీ తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా ‘లూసిఫర్‌’ చిత్రం యావత్‌ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రమే ‘ఎల్‌2: ఎంపురాన్‌’ (L2: Empuraan Telugu Movie Review ). పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లే దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్‌ చేశారు మేకర్స్‌. టాలీవుడ్‌లో దిల్‌ రాజు విడుదల చేస్తుండడంతో ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
లూసిఫర్‌ చిత్రం ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. పీకేఆర్‌ మరణంతో కేరళలో రాజకీయ అలజడి మొదలవ్వడం.. సీఎం సీటు కోసం కుట్రలు చేసిన బాబీ(వివేక్‌ ఒబెరాయ్‌)ని స్టీఫెన్‌ (మోహన్‌లాల్‌) అడ్డుకొని.. పీకేఆర్‌ కొడుకు జతిన్‌ రాందాస్‌(టొవినో థామస్‌)ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తాడు. అక్కడితో లూసిఫర్‌ కథ ముగుస్తుంది. సీఎం అయిన తర్వాత జతిన్‌ రాందాస్‌ బుద్ది కూడా మారుతుంది. 

సొంత ప్రయోజనాల కోసం మతతత్వ వాది బాబా భజరంగి(అభిమన్యు సింగ్‌)తో చేతులు కలిపి ఎల్‌యూఎఫ్‌ పీకేఆర్‌ అని కొత్త పార్టీని స్థాపించి ఎన్నికల్లోకి వెళ్తాడు. ఈ విషయం లండన్‌లో ఉన్న స్టీఫెన్‌(మోహన్‌ లాల్‌)కి తెలుస్తుంది. తన రాష్ట్రాన్ని కబలించడానికి శత్రువులంతా ఏకమై రాజకీయ యుద్ధం చేయడానికి సిద్ధమైతే..స్టీఫెన్‌ దాన్ని ఎలా తిప్పికొట్టాడు? అనేది సినిమా కథ. అసలు స్టీఫెన్‌ నేపథ్యం ఏంటి? ఖురేషీ అబ్రాన్‌గా పేరు మార్చుకొని విదేశాల్లో ఏం చేస్తున్నాడు? అతని కోసం ఇతర దేశాల గుఢాచార సంస్థలు ఎందుకు వెతుకుతున్నాయి. జతిన్‌ కొత్త పార్టీని స్థాపించిన తర్వాత పీకేఆర్‌ కూతురు ప్రియ(మంజు వారియర్‌) ఎలాంటి నిర్ణయం తీసుకుంది? బల్రాజ్‌ పటేల్‌ కాస్త బాబా భజరంగిగా ఎలా మారాడు? భజరంగికి జయేద్‌ మసూద్‌(పృథ్విరాజ్‌ సుకుమార్‌) మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(L2: Empuraan Movie Review ) 

ఎలా ఉందంటే..
ఆరేళ్ల క్రితం వచ్చిన లూసిఫర్‌ చిత్రంలో మోహన్‌లాల్‌ని డిఫరెంట్‌గా చూపించడంతో పాటు పొలిటికల్‌ డ్రామాను బాగా పండించాడు దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్‌, మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. సీక్వెల్‌కి కూడా అదే ఫాలో అయ్యాడు. 

హీరోతో పాటు ప్రతి పాత్రకు భారీ ఎలివేషన్స్‌ ఇచ్చాడు.కథ-కథనాన్ని కూడా బాగానే రాసుకున్నాడు. కానీ కథ కంటే ఎక్కువ ఎలివేషన్స్‌పైనే దృష్టిపెట్టాడు. మోహల్‌లాల్‌ వచ్చే ప్రతి సీన్‌కి ఎలివేషన్‌ పెట్టడం కొన్నిచోట్ల అతిగా అనిపిస్తుంది. అలాగే సినిమాలోని ప్రతి పాతకు ఓ ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ చూపించడంతో కథనం సాగదీసినట్లుగా సాగుతుంది. సీన్ల పరంగా చూస్తే మాత్రం సినిమా అదిరిపోతుంది. ప్రతి ఐదు పది నిమిషాలకు గూస్‌బంప్స్‌ తెప్పించే సన్నివేశం ఉంటుంది. 

సినిమా ప్రారంభమైన యాభై నిమిషాల వరకు మోహన్‌లాల్‌ తెరపై కనిపించడు.  ఆయన వచ్చి ఈ రాజకీయ అలజడిని ఎలా అడ్డుకుంటాడో అనేలా కథనాన్ని నడిపించి.. ఆయన ఎంట్రీ కోసం ఎదురు చూసేలా చేశారు.  ప్రేక్షకుడు ఎదురుచూపులకు ఏ మాత్రం నిరాశ కలగకుండా ఎంట్రీ సీన్‌ ఉంటుంది.  హీరో విదేశాల్లో ఉన్నప్పుడు వచ్చే యాక్షన్‌ సీన్లు హాలీవుడ్‌ సినిమాలను గుర్తు చేస్తాయి.  ఆయా సన్నివేశాలను స్టైలీష్‌గా తీర్చి దిద్దారు. 

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ద్వితియార్థం మొత్తం కేరళ రాజకీయాల చుట్టే జరుగుతుంది.  అయితే సినిమాల్లో చాలా లేయర్లు ఉండడం.. పార్ట్‌ 3 కోసమే అన్నట్లుగా కొన్ని సన్నివేశాలు పెట్టడం ఆడియెన్స్ ని డీవియేట్‌ చేస్తుంది. ఇక సినిమాకి మరో ప్రధాన మైనస్‌ ఎంటంటే.. డైలాగులు. ఈ సినిమాలోని డైలాగులలో ఎక్కువగా ఓ మతం ప్రజలు వాడే పదాలే ఎక్కువగా కలిపిస్తాయి . డబ్బింగ్‌ విషయంలో జాగ్రత్త పడాల్సింది. తెలుగు నేటివిటికి తగ్గట్లుగా మార్పులు చేస్తే బాగుండేది.  క్లైమాక్స్‌లో మోహల్‌ లాల్‌, పృథ్విరాజ్‌ కలిసి చేసే ఫైటింగ్‌ సీన్‌  ఫ్యాన్స్‌ని ఈలలు వేయిస్తుంది.  పార్ట్‌ 3పై ఆసక్తిని పెంచేలా ముగింపు ఉంటుంది.  స్టీఫెన్‌ అలియాస్‌ ఖురేషీ అబ్రాన్‌ నేపథ్యం పూర్తిగా తెలియాలంటే ‘ఎల్‌ 3’ కోసం ఎదురు చూడాల్సిందే. 

ఎవరెలా చేశారంటే.. 
మోహన్‌లాల్‌ యాక్టింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో ఆయన ఒకరు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. ‘ఎల్‌2:ఎంపురాన్‌’లో స్టీఫెన్‌గా, ఖురేషి అబ్రాన్‌గా రెండు పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఫ్యాన్స్‌ సినిమా చూడడానికి ఆయన ఎంట్రీ సీన్‌ ఒకటి చాలు. తెరపై ఆయన కనిపించిన ప్రతిసారి ఫ్యాన్స్‌కి పునకాలే. సీఎం జతిన్‌ రాందాస్‌గా టోవినో థామస్‌  సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించారు. 

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌  తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పాత్ర కోసం రాసుకున్న సన్నివేశాలే సినిమాకు కీలకం. మంజు వారియర్‌ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించింది. పొలిటికల్‌ లీడర్‌గా ఆమె బాగా నటించారు. సెకండాఫ్‌లో ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. ఇక విలన్‌ బాబా భజరంగీ అలియాస్‌ బల్రాజు పటేల్‌గా అభిమన్యు సింగ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతావారంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. యాక్షన్‌ కొరియోగ్రఫీ సినిమా స్థాయిని పెంచేసింది. హాలీవుడ్‌ మూవీ స్థాయిలో యాక్షన్‌ సీన్లను తీర్చిదిద్దారు.  సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించాడు. దీపక్ దేవ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను ఇంకాస్త క్రిస్పీగా కట్‌ చేసి, నిడివిని తగ్గిస్తే బాగుండేదేమో.  లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ పిక్చర్స్, శ్రీ గోకులం మూవీస్  నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)