Breaking News

ఆ ధైర్యం ఉంటేనే సినిమా తీయాలి: నిర్మాత శ్రీధర్ రెడ్డి

Published on Thu, 12/29/2022 - 15:39

‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించడం చాలెంజింగ్‌ మారింది.  సినిమాను ప్రారంభించడం, పూర్తి చేయడం, రిలీజ్ చేయడం అన్నీ నిర్మాతకు సవాళ్లే. వాటిని ఎదుర్కొగలను అనే ధైర్యం ఉంటేనే సినిమా నిర్మాణ రంగంలోకి దిగాలి’అని నిర్మాత కేవీ శ్రీధర్‌ రెడ్డి అన్నారు. ఆది సాయి కుమార్‌, రియా జంటగా కె.శశికాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాప్‌ గేర్‌’. ఆదిత్య మూవీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో కేవీ శ్రీధర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కేవీ శ్రీధర్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

మనం కథ విన్నప్పుడు అది మనల్ని హాంట్ చేయాలి. శశికాంత్ ‘టాప్‌ గేర్‌’ కథ చెప్పిన తరువాత నాకు చాలా నచ్చింది. ఈ కథ విన్న తరువాత ఆది అయితే బాగుంటుందని మేం అనుకున్నాం. వెళ్లి కథ చెప్పాం. ఆయన ఓకే అన్నారు. ఈ సినిమాతో ఆదికి వచ్చే ఏడాది శుభారంభం కానుంది. ఆది మంచి డ్యాన్సర్. మంచి నటుడు. టాప్ గేర్ సినిమాతో వచ్చే ఏడాది ఆయన దశ మారుతుంది.

► టాప్ గేర్ సినిమాను డైరెక్టర్ అద్భుతంగా తీశారు. ఇందులో స్క్రీన్ ప్లే హైలెట్ అవుతుంది. నెక్ట్స్ సీన్ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా సినిమాను తీశారు.  హర్షవర్దన్ మ్యూజిక్, ఆర్ఆర్ సినిమాకు చాలా ప్లస్ అవుతుంది.

► ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ కన్నా కాస్త పెరిగింది. క్వాలిటీ కోసమే ఖర్చు పెట్టాం. సినిమాను చూశాక ఆడియెన్స్‌ కూడా అదే మాట చెబుతారు. కంటెంట్ మీదున్న నమ్మకంతోనే సినిమాను తీశాం. నాకున్న పరిచయాలతో సినిమాను సేఫ్ ప్రాజెక్ట్‌గా మార్చగలను.

 టాప్ గేర్ సినిమాను చూశాక సాయి కుమార్.. ‘ఆదికి 2023 చాలా బాగుండబోతోందని, టాప్ గేర్ సినిమాతో అది ప్రారంభం అవుతుంది’అని చెప్పారు. టాప్ గేర్ సినిమా పట్ల ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)