Breaking News

ఇప్పటి కాలం వేరు.. మా పిల్లకు అదే చెబుతాం: కుష్బూ సుందర్‌

Published on Sun, 06/21/2026 - 08:28

‘‘ఇంతకు ముందు పెళ్లి వ్యవహారాన్ని హీరోయిన్లు రహస్యంగా మార్చేశారు. ఇప్పుడు కాలం మారింది. యువతరం కొత్తగా ఆలొచిస్తున్నారు. వారితో పాటు మనం మారుతున్న పరిస్థితి. మా పెద్ద అమ్మాయి అవంతికకు పెళ్లి జరగబోతోంది. ఆమె హీరోయిన్‌ ఎంట్రీ ఇచ్చి రెండు చిత్రాల్లో నటించారు. మరో రెండు చిత్రాల్లో నటించనున్నారు. ఇక మా రెండో కూతురు ఆనందిత కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఆమె నిర్వహణ బాధ్యతలను నిర్వహించిన తొలి చిత్రం డబుల్‌ ఆక్యుపెంసీ. గత 12 వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. 

ఈ చిత్ర విజయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా కెమెరా ముందు, వెనుక పని చేసిన టీమ్‌ కే చెందుతుంది. కష్టపడి సంపాదించిన డబ్బుతో చిత్రం చేయడానికి థియేటర్‌ లకు కుటుంబసమేతంగా వచ్చే ప్రేక్షకులకు పైసా వసూల్‌ అని చెప్పుకుంటూ జాలీగా బయటకు వెళ్లాలనే నేను, సుందర్‌ సి మా పిల్లలకు చెబుతాం.

 అదే విధంగా ఇక్కడ మీకంటే ఎవరు ఎక్కువ కాదు. ప్రతిభను చాటుతూ శ్రమిస్తే విజయం తధ్యం అని చెపుతాం. ఆ విధంగా చిత్ర నిర్మాణ రంగంలో మా రెండవ కూతురు ఆనందిత మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర యూనిట్‌ కు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయబోతున్నాం. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెల్లడిస్తాం’’ అని డబుల్‌ ఆక్యుపెంసీ చిత్ర సక్సెస్‌ మీట్‌ లో నటి, నిర్మాత కుష్బూ సుందర్‌ పేర్కొన్నారు. 

వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అవ్వీ మూవీస్‌, బెంచ్‌ మీడియా సంస్థలు కలిసి నిర్మించారు. అశ్విన్‌ కందస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్‌, సంయుక్త విశ్వనాధన్‌, రేష్మా వెంకటేష్‌, వినోద్‌ కిషన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)