Breaking News

'మా సినిమాలు చూసి ‍అసూయ పడుతున్నారు'.. స్టార్‌ హీరో

Published on Sun, 04/13/2025 - 18:13

మలయాళ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కుంచకో బోబన్. మాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఇటీవలే సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించారు. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేశారు. ‍అయితే మలయాళంలో 100కు పైగా చిత్రాల్లో నటించిన కుంచకో బోబన్.. ఇతర భాషల్లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ విషయంపై ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పటివరకు మలయాళం కాకుండా మరే ఇతర భాషలో ఎందుకు పని చేయలేదన్న ప్రశ్నపై స్పందించారు.

కుంచకో బోబన్ మాట్లాడుతూ.. 'నేను నిరంతరం నా క్రాఫ్ట్ గురించి నేర్చుకుంటూనే ఉంటా.  నన్ను మరింత మెరుగుపరుచుకుంటున్నా. ప్రస్తుత రోజుల్లో కంటెంట్ పరంగా చూస్తే మలయాళ చిత్ర పరిశ్రమ మంచి దశలో ఉందని అనుకుంటున్నా.  నిజానికి మలయాళంలో విడుదల చేస్తున్న విభిన్నమైన చిత్రాలను చూసి ఇతర పరిశ్రమలు అసూయపడుతున్నాయి. ఎందుకంటే మా చిత్రాల్లో నాణ్యత, ఇతివృత్తం, కథ కూడా కారణం కావొచ్చు. మా సినిమాలు స్థానికంగా తీస్తున్నప్పటికీ పాన్-ఇండియా, గ్లోబల్‌ రేంజ్‌కి మారిపోతున్నాయి. ఇప్పుడు మలయాళంలో రూపొందుతున్న సినిమాలు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటున్నాయి. అయితే ఇతర భాషల్లోనూ నటించేందుకు అసక్తిగా ఉన్నా. కానీ ప్రత్యేకించి తమిళంలో ఏదైనా ఒక అద్భుతమైన పాత్ర వచ్చినట్లయితే కచ్చితంగా చేస్తా. అలాంటి ‍అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నా' అని అన్నారు.

 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)