బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం
Breaking News
అనిల్ రావిపూడి సినిమా.. రెండో హీరోయిన్‌గా ఎవరంటే?
Published on Thu, 03/26/2026 - 09:01
టాలీవుడ్ హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సంక్రాంతికి చిరంజీవి - వెంకటేశ్‌లతో కలిసి ‘మన శంకరవరప్రసాద్‌గారు’తో భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే, వచ్చే సంక్రాంతి కోసం ఆయన తెరకెక్కించబోయే సినిమాలో వెంకటేశ్ - నందమూరి కల్యాణ్‌రామ్ నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. తాజాగా రెండో హీరోయిన్ గురించి కూడా వైరల్ అవుతుంది.

2027 సంక్రాంతికి వెంకటేశ్, కల్యాణ్‌రామ్ సందడి చేయనున్నారు. ఈ మూవీలో మరో హీరోయిన్‌గా కృతిశెట్టి(Krithi Shetty) పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. కల్యాణ్ రామ్‌కు జోడీగా ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ సమ్మర్ నుంచి షూటింగ్ ప్రారంభ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో పూర్తి వివరాలు అనిల్ రావిపూడి ప్రకటించనున్నారని సమాచారం.
Tags : 1