Breaking News

ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్‌’ కథ రాశా: డైరెక్టర్‌ కృష్ణమాచారి

Published on Wed, 05/15/2024 - 14:22

‘‘భాగ్యలక్ష్మి బంపర్‌ డ్రా’లో అలీగారికి కోటి రూపాయిల లాటరీ తగులుతుంది. ఆ ఆనందంలో ఆయన నవ్వుతూనే చనిపోతారు. సినిమా అంతా నవ్వు ముఖంతోనే ఉంటారు. అలాగే క్రికెటర్‌ లక్ష్మీపతి బాలాజీకి జరిగిన సర్జరీ వల్ల ఆయన ముఖం ఎప్పుడూ నవ్వుతున్నట్లే కనిపిస్తుంది. ఇలాంటి లోపంతో కథ రాస్తే బావుంటుందనిపించి ‘రాజు యాదవ్‌’ స్క్రిప్ట్‌ రాశాను’’ అని డైరెక్టర్‌ కృష్ణమాచారి అన్నారు. 

గెటప్‌ శ్రీను హీరోగా కె. ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌  కల్లెపల్లి నిర్మించిన చిత్రం ‘రాజు యాదవ్‌’. ఈ నెల 17న ఈ సినిమా రిలీజవుతున్న సందర్భంగా కృష్ణమాచారి మాట్లాడుతూ– ‘‘15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను. ‘నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం’ చిత్రాలకు దర్శకుడు వేణు ఊడుగులగారి వద్ద అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేశాను. దర్శకుడిగా ‘రాజు యాదవ్‌’ నా తొలి చిత్రం. 

నాకు సహజత్వంతో కూడకున్న సినిమాలంటే ఇష్టం. ‘రాజు యాదవ్‌’ రియలిస్టిక్‌గా ఉంటుంది. గెటప్‌ శ్రీను కెరీర్‌లో ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుంది. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం, సురేష్‌ బొబ్బిలి నేపథ్య సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. చంద్రబోస్‌గారు మా సినిమా కోసం ఓ పాట రాసి,  పాడటం సంతోషంగా ఉంది. సినిమా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)