Breaking News

ఈ బయోపిక్‌లో నటించడం నా అదృష్టం : కృష్ణ చైతన్య

Published on Sun, 12/07/2025 - 08:56

దిగ్గజ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు (ఘంటసాల) జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల: ది గ్రేట్‌’. ఈ బయోపిక్‌లో ఘంటసాలగా కృష్ణచైతన్య, మృదుల ఘంటసాలగా సావిత్రమ్మ, చిన్న ఘంటసాలగా అతులిత, కీలక పాత్రలో సుమన్‌ నటించారు. 

సీహెచ్‌ రామారావు రచన, దర్శకత్వంలో అన్యుక్త్‌ రామ్‌ పిక్చర్స్‌ సమర్పణలో సీహెచ్‌ ఫణి నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కృష్ణ చైతన్య మాట్లాడుతూ – ‘‘ఘంటసాలగారి పాటలు వింటూ పెరిగిన నాకు ఈ సినిమాలో ఆయన పాత్ర చేసే అదృష్టం దక్కడం ఒక వరం’’ అన్నారు. ‘‘ఇప్పటికే 70కి పైగా చిత్రాలు రిలీజ్‌ చేసిన నాకు ఘంటసాలగారి బయోపిక్‌ రిలీజ్‌ చేసే చాన్స్‌ రావడం నా అదృష్టం. ఈ చిత్రం ‘శంకరాభరణం’ లెవల్లో వెళ్లాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు నిర్మాత–డిస్ట్రిబ్యూటర్‌ శోభారాణి. 

‘‘ఘంటసాలగారి గురించి ఈ తరానికి తెలియాలనే తపనతో ఈ సినిమా తీశాం’’ అన్నారు సీహేచ్‌ రామారావు. ఈ చిత్రం తొలి టికెట్‌ను రూ. లక్షతో చదలవాడ శ్రీనివాసరావు కొనుగోలు చేశారు. నిర్మాత ఫణి, రచయిత అనంత శ్రీరామ్, దర్శకుడు రేలంగి నరసింహారావు, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, రచయిత జేకే భారవి పాల్గొన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)