తొలిసారి అలాంటి సీన్‌ చేశా! 

Published on Sat, 11/18/2023 - 02:35

‘‘నేనిప్పటివరకూ ఏ సినిమాలోనూ సిగరెట్‌ తాగే సన్నివేశంలో నటించలేదు. ‘కోట బొమ్మాళి పీఎస్‌’ సినిమా కథకు అవసరం కావడంతో తొలిసారి స్మోకింగ్‌ సన్నివేశం చేశాను. అందుకే ఈ చిత్రం నాకు సవాల్‌గా అనిపించింది’’ అని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ అన్నారు. రాహుల్‌ విజయ్, శివానీ రాజశేఖర్‌ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ చెప్పిన విశేషాలు.

∙నేను కథే హీరోగా భావిస్తాను. నా కెరీర్‌లో తమిళంలో ఎక్కువగా పోలీస్‌ పాత్రలు చేశాను. కానీ తెలుగులో మాత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’ నా తొలి మూవీ. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది కాబట్టి పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలకు క్రేజ్‌ ఉంటోంది. ∙‘కోట బొమ్మాళి పీఎస్‌’లో శ్రీకాంత్‌గారు, నేను పోలీస్‌ ఆఫీసర్స్‌. ఇద్దరిలో ఒకరు క్రిమినల్‌ అయితే ఎలా ఉంటుంది? పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? అన్నది ఈ చిత్రకథ.

పిల్లి మరియు ఎలుక ఆటలా థ్రిల్‌ చేసేలా ఉంటుంది. ఓటు గురించి అవగాహన కల్పించే లైన్‌ కూడా ఉంటుంది. ఎన్నికల టైమ్‌లో వస్తున్న మా సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ∙‘వరలక్ష్మి చాలా వైవిధ్యంగా చేసింది’ అని ప్రేక్షకులు అనుకునేలా మంచి పాత్రలు చేయడమే నా లక్ష్యం. లేడీ ఓరియంటెండ్‌ సినిమాలతో పాటు పాత్ర నచ్చితే ఎలాంటి మూవీలోనైనా నటించడానికి రెడీ. తెలుగులో నేను నటించిన ‘హనుమాన్‌’ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. కన్నడలో సుదీప్‌తో ‘మ్యాక్స్‌’ చిత్రంలో నటిస్తున్నాను.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)