Breaking News

ఆ పాత్రను ఎన్టీఆర్‌ తప్ప ఇండియాలో మరొకరు చేయలేరు: కోన వెంకట్‌

Published on Wed, 04/03/2024 - 16:44

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో అదుర్స్‌ ఒకటి. వీవీ వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో రిలీజై ఘన విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్‌ డ్యూయల్‌ రోల్‌ ప్లే చేశాడు. చారి పాత్రలో ఎన్టీఆర్‌ పండించిన కామెడీ అంత ఇంతకాదు. ఇంతవరకు ఎప్పుడు ఎన్టీఆర్‌ని ఆ తరహా పాత్రలో చూడలేదు. బ్రహ్మానందం, ఎన్టీఆర్‌ మధ్య వచ్చే సీన్స్‌ సినిమాకే హైలెట్‌. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చారి పాత్రను మరిచిపోరు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు ఎన్టీఆర్‌. ఈ చిత్రానికి సీక్వెల్‌ వస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు.

తాజాగా ఆ చిత్ర రచయిత కోన వెంకట్‌ కూడా స్వీక్వెల్‌ వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎప్పటికైనా మంచి పాయింట్‌తో అదుర్స్‌ 2 తెరకెక్కిస్తామని, ఆ సినిమాకు ఎన్టీఆర్‌ మాత్రమే న్యాయం చేయగలడని కోన వెంకట్‌ అన్నారు.  బుధవారం జరిగిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కోనవెంకట్‌ అదుర్స్‌ 2 అప్‌డేట్‌ ఇచ్చాడు. ‘అదుర్స్‌ 2 చేయాలని పక్కాగా అనుకుంటున్నాను. ఎప్పటికైనా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. అవసరం అయితే నేనే తారక్‌ ఇంటిముందు ధర్నా చేసి మరీ సినిమాకు ఒప్పిస్తా. చారి పాత్రను ఎన్టీఆర్ తప్ప దేశంలో మరెవరూ చేయలేరు.ఎన్టీఆర్ కెరీర్లోనే అది బెస్ట్ మూవీ. ఆ క్యారెక్టర్, ఆ ఆహార్యం, ఆ మాడ్యులేషన్.. ఆ క్యారెక్టర్‌ను ఎన్టీఆర్‌లాగా చేసే వారు ఇండియాలోనే లేరు’ అని కోన వెంకట్‌ అన్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)