Breaking News

ఫేవరేట్ డైరెక్టర్‌తో విశాల్ కొత్త మూవీ.. టాలీవుడ్ డిజాస్టర్ టైటిల్‌తోనే..!

Published on Wed, 01/21/2026 - 21:12

కోలీవుడ్ స్టార్ విశాల్ చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తన ఫెవరేట్ డైరెక్టర్‌ సుందర్ సితో మరోసారి జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి పురుషన్‌ అనే టైటిల్ ఖరారు చేశారు. తెలుగులో మొగుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు. టైటిల్‌ రివీల్ చేస్తూ ఏకంగా ఐదు నిమిషాల వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ వీడియో యోగిబాబుతో తమన్నా చేసే కామెడీ ఫుల్‌గా నవ్వులు తెప్పిస్తోంది. ఆ తర్వాత వంటగదిలో విశాల్ చేసే ఫైట్‌ వేరే లెవెల్లో ఉంది. ఇది చూసిన యోగిబాబు రియాక్షన్‌ చూస్తే సీరియస్‌ సీన్‌లో కామెడీ చేయడం అద్భుతంగా అనిపిస్తోంది. 'మొగుడులా ఉండటం ముఖ్యం కాదు.. మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం. అర్థమైందా అత్తయ్యా..' అంటూ యోగిబాబు చెప్పే డైలాగ్‌లు  నవ్వులు తెప్పిస్తున్నాయి.

గోపిచంద్‌ టైటిల్‌నే..

అయితే ఈ మూవీ టైటిల్‌ మొగుడు కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో గోపిచంద్‌, తాప్సీ జంటగా వచ్చిన మూవీ టైటిల్ మొగుడు కావడం విశేషం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇప్పుడు అదే టైటిల్‌తో విశాల్‌ ప్రయోగం చేయడం కలిసొస్తుందా? డిజాస్టర్‌ అవుతుందా?  వేచి చూడాల్సిందే. 
 

 

Videos

జమ్మూకశ్మీర్ : దోడా జిల్లాలో ఘోర ప్రమాదం

జార్ఖండ్‌లోని చైబాసాలో భారీ ఎన్ కౌంటర్

Viral Video: నంద్యాల బస్సు ప్రమాదం CCTV వీడియో

YS Jagan: ఏంటి బాబు ఈ పనికిమాలిన పనులు

YS Jagan: నీకు కొడుకు వయసులో ఉన్నా.. నాతో కూడా పోటీ పడలేకపోతున్నావ్

సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు బాబు బండారం బయటపెట్టిన వైఎస్ జగన్

భూ రీసర్వే పై YS జగన్ రియాక్షన్

YS Jagan: సొమ్మొకరిది.. సోకొకరిది

13 రూపాయల వడ్డీ టైం కి ఇవ్వకపోతే అంతు చూస్తా..!

గుర్తుపెట్టుకో బాబూ.. రేపు మా వాళ్లు నేను ఆపినా ఆగరు!

Photos

+5

ఇప్పుడు స్టార్‌ సెలబ్రిటీస్‌.. పదేళ్ల కిందట ఎలా ఉన్నారంటే? (ఫోటోలు)

+5

బ్లాక్‌ & వైట్‌ డ్రెస్‌లో జిగేలుమంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

మేడారం మహాజాతరలో తొలిఘట్టం...ఘనంగా మండమెలిగె పండుగ (ఫొటోలు)

+5

ఫుల్‌ జోష్‌లో బిగ్‌బాస్‌ విష్ణు ప్రియ (ఫోటోలు)

+5

ఎల్లే లిస్ట్ అవార్డులు 2026...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

కాలుదువ్వుతూ..రంకెలేస్తూ రంగంపేట జల్లికట్టు (ఫొటోలు)

+5

కడప : అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం..హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌..తొలి టి20లో భారత్‌ ఘనవిజయం (ఫొటోలు)

+5

అదే మొదటిసారి అంటున్న రుక్మిణి వసంత్‌ (ఫోటోలు)

+5

ఉజ్జయిని మహకాళేశ్వర్ ఆలయంలో హీరోయిన్ లక్ష‍్మీరాయ్ పూజలు (ఫొటోలు)