Breaking News

సినిమాలో విలన్స్ కంటే బయటే ఎక్కువ: విశాల్ హాట్ కామెంట్స్

Published on Mon, 04/15/2024 - 06:58

సినిమాల్లో కంటే బయటే ఎక్కువ విలన్లు ఉన్నారని కోలీవుడ్ స్టార్‌ హీరో విశాల్‌ పేర్కొన్నారు. ఆయన ఇటీవల హీరోగా నటించిన మార్క్‌ ఆంటోని చిత్రం ఘన విజయాన్ని సాధించింది. తాజాగా హరి దర్శకత్వంలో రత్నం చిత్రంలో నటించారు. నటి ప్రియా భవానీశంకర్‌ నాయకిగా నటించిన ఈ చిత్రం ఈనెల 26న తెరపైకి రానుంది. తాజాగా తమిళ నూతన సంవత్సరం సందర్భంగా తమిళ‌ సినీ పాత్రికేయుల సంఘం ఆదివారం ఉదయం స్థానిక వడపళనిలోని సంగీత కళాకారుల సంఘం ఆవరణలో నిర్వహించిన వేడుకలో విశాల్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

అనంతరం ఈ కార్యక్రమంలో పాత్రికేయులతో ముచ్చటించారు. తాను తాజాగా నటించిన రత్నం చిత్రం కుటుంబసమేతంగా చూసి ఆనందించే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందన్నారు. దర్శకుడు హరి ఈ చిత్ర కథ చెప్పినప్పుడే అందులోని ముఖ్య పాయింట్‌ అద్భుతం అనిపించిందన్నారు. ఈ చిత్రం విడుదల తరువాత తాను స్వీయ దర్శకత్వంలో నటించే తుప్పరివాలన్‌- 2 చిత్రం షూటింగ్‌ ప్రారంభం అవుతుందని చెప్పారు. మే 5తేదీన షూటింగ్‌ లండన్‌లో మొదలవుతుందని చెప్పారు.

దీంతో విశాల్‌ కూడా దర్శకుడు అవుతున్నాడు.. కొత్తగా ఈయనే చేస్తారులే అని అనుకునేవారు ఇక్కడ ఉంటారన్నారు. అలాంటి వారి కోసమే తాను తుప్పరివాలన్‌–2 చేస్తున్నట్లు చెప్పారు. కాగా దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తిచేస్తామని చెప్పారు. మెరీనా తీరంలో ఎంజీఆర్‌ సమాధిని చూడడానికి ఎలాగైతే ప్రజలు వస్తారో.. అలా నటీనటుల సంఘం నూతన భవనాన్ని చూడడానికి వచ్చేలా దీన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించే విధంగానూ, కల్యాణమంటపం, రంగస్థల నటుల కోసం వేదికను వంటి పలు వసతులతో ఈ భవనం ఉంటుందని విశాల్‌ పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)