Breaking News

ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్: స్టార్ హీరో

Published on Sat, 01/13/2024 - 09:35

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్‌ నటించిన తాజా చిత్రం అయలాన్‌. ఈ చిత్రానికి రవికుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా కనిపించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య అయలాన్‌ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా శివకార్తికేయన్‌  చైన్నెలో మీడియాతో ముచ్చటించారు.

శివకార్తికేయన్ మాట్లాడుతూ.. 'అయలాన్‌ చిత్రం తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ఇతర చిత్రాలను బ్రహ్మాండంగా రూపొందించడం శంకర్‌ తరువాత రవికుమారే ఉంటారు. ఆర్థిక సమస్యల కారణంగా చిత్ర నిర్మాణం కాస్తా ఆలస్యమైంది. అయలాన్‌ చిత్ర షూటింగ్‌ను 75 శాతం పూర్తి చేసిన తరువాత ఈ చిత్రం ఎలా వస్తుందో మాకు అర్థమైపోయింది. దీంతో చిత్రాన్ని పక్కన పెట్టలేకపోయామని చెప్పారు. ఈ చిత్రాన్ని రాజీ పడకుండా చేశామని చెప్పారు. అయలాన్‌ చిత్రానికి కచ్చితంగా సీక్వెల్‌ ఉంటుంది' అని తెలిపారు. కాగా..  ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతాన్ని అందించారు.

కాగా.. ప్రస్తుతం రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో నటిస్తున్నట్లు శివకార్తికేయన్ వెల్లడించారు. ఈ సినిమాలో నటి సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ 80 శాతం పూర్తైనట్లు తెలిపారు. ఆ తర్వాత ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనున్నట్లు శివకార్తికేయన్ చెప్పారు. ఇందులో మృణాల్‌ ఠాగూర్‌ నాయకిగా నటిస్తున్నారని తెలిపారు.

కాగా.. రజనీకాంత్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో నటించనున్న చిత్రంలో తాను నటించనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని శివకార్తికేయన్ తెలిపారు. తాను రజనీకాంత్‌కు అభిమానిని అని వెల్లడించారు. అయితే ఆయనతో కలిసి నటించడం లేదని స్పష్టం చేశారు.
 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)