Breaking News

పక్కవాడితో నీకెందుకు.. ముందు నువ్వు బాగుండాలి కదా?: అజిత్ కుమార్

Published on Wed, 01/15/2025 - 07:28

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా అభిమానులను ఉద్దేశించిన ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదని ఫ్యాన్స్‌కు సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్స్‌ వార్‌పై ఆయన మాట్లాడారు.

అజిత్ మాట్లాడుతూ.. 'ఇతరుల విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. మీరు చేయాల్సిన పనిపై ముందు దృష్టి పెట్టండి. ఇతరుల గురించి ఆలోచిస్తూ మీరు టైన్షన్ తెచ్చుకోకండి. అలాంటి వాటితో మీకేలాంటి ఉపయోగం ఉండదు. ముందు మీ లైఫ్‌ గురించి ఆలోచించండి. నేను నా అభిమానులకు కూడా ఇదే చెబుతా. సినిమాలు చూడటం వరకు ఓకే.. కానీ జై అజిత్‌.. జై విజయ్‌ అంటుంటే జై కొడుతూ ఉంటే నువ్వెప్పుడు బాగుపడతావ్. మీ చూపిస్తున్న ప్రేమకు నాకు ఆనందంగానే ఉంటుంది.  కానీ మీ జీవితం బాగున్న తర్వాతే కదా ఏదైనా. నా ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారని తెలిసినప్పుడే నాకు సంతోషంగా అనిపిస్తుంది'  అని అన్నారు.

కాగా.. ఇటీవల దుబాయ్‌ కారు రేసింగ్‌లో అజిత్ టీమ్ మూడో స్థానంలో నిలిచింది. అజిత్ కారు రేసింగ్ గెలవడంపై సినీ ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపించారు. రేస్ గెలిచిన తర్వాత జాతీయ జెండా పట్టుకుని అజిత్ సంతోషం వ్యక్తం చేశారు. 

విదాముయార్చి వాయిదా..

కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం అజిత్ కుమార్(ajith Kumar) విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఊహించని కారణాలతో ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాలేదు. ఈ సినిమాకు మగిళ్‌ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించారు.  అర్జన్‌ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్డెట్‌లో నిర్మించారు.

మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా..

అజిత్ కుమార్‌ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్  థ్రిల్లర్‌ మూవీ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్‌గా నటిస్తోంది . ‘మార్క్‌ ఆంటోని’ ఫేమ్‌ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)