Breaking News

'ఇలాంటి టైటిల్‌ పెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది'

Published on Mon, 03/25/2024 - 14:50

మిర్చి విజయ్‌, అంజలి నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం వైఫ్. ఈ చిత్రం ద్వారా హేమంత్‌ నాదం దర్శకుడిగా పరిచయమవుతున్నారు.  ఒలింపియ మూవీస్‌ సంస్థ అధినేత ఎస్‌.అంబేడ్కర్‌ నిర్మిస్తున్నారు. గతంలో జిప్సీ, డాడా, కలిగేత్తి మూర్కన్‌ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను  ఆయన నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 

దంపతుల మధ్య నవీన అనుబంధాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఇది ఉంటుందని డైరెక్టర్ హేమంత్‌ నాదం అన్నారు. అందుకే ఈ చిత్రానికి వైఫ్‌ అని పేరు పెట్టామని తెలిపారు. ఇలాంటి టైటిల్‌ను ఇప్పటివరకు ఎవరూ పెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. చదరంగంలో రాణికి అపార శక్తి ఉంటుందన్నారు. అదేవిధంగా ఒక ఇంటిని చక్కదిద్దడంలో భార్య పాత్ర ముఖ్యమన్నారు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య పెరిగే ప్రేమానుబంధాన్ని ఎమోషనల్‌గా ఆవిష్కరించే చిత్రమని చెప్పారు.

ఈ చిత్రం ద్వారా మిర్చి విజయ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కేఏ శక్తివేల్‌ చాయాగ్రహణం, జెన్‌ మార్టిన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో మైత్రేయన్‌, రెడిన్‌ కింగ్స్‌ లీ, కల్యాణి నటరాజన్‌, విజయ్‌బాబు, విల్లు, కదిర్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)