Breaking News

అతనికి మొహం చూపించలేకపోయా.. రవితేజకు స్పెషల్ థ్యాంక్స్: నిర్మాత

Published on Fri, 07/21/2023 - 12:40

శివకార్తికేయన్‌, అదితిశంకర్‌ జంటగా నటించిన చిత్రం మావీరన్‌( మహావీరుడు). నటి సరిత, దర్శకుడు మిష్కిన్‌, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మించారు. గత 14న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ గురువారం ఉదయం చైన్నెలోని సత్యం థియేటర్లో థ్యాంక్స్‌ మీట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత అరుణ్‌ విశ్వ మాట్లాడుతూ దర్శకుడు మడోన్‌ అశ్విన్‌ రైటింగ్‌, కన్వెన్షన్‌, క్లారిటి ఈ చిత్ర విజయానికి ముఖ్యకారణం అని నిర్మాత పేర్కొన్నారు. చిత్ర బాధ్యతంతా తన భుజాలపైనే మోశారు. తాను ఇంతకుముందు ప్రిన్స్‌ చిత్రానికి తాను సహ నిర్మాతగా వ్యవహరించానని, ఆమె చిత్రం సరిగ్గా ఆడలేదంది. దీంతో శివకార్తికేయన్‌ ఆ నష్టాన్ని భర్తీ చేశారన్నారు. ఆ తరువాత ఆయన్ని కలవడానికి తనకు ముఖం చెల్లలేదన్నారు.

అలాంటి సమయంలో శివకార్తికేయనే ఫోన్‌ చేసి మావీరన్‌ చిత్రం చేద్దామని చెప్పి అన్నీ తానై ఈ చిత్రాన్ని చేశారన్నారు. ఈ చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ చెప్పడానికి అంగీకరించిన విజయ్‌సేతుపతికి, అదేవిధంగా తెలుగు వెర్షన్‌కి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన రవితేజకు థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నానన్నారు. చిత్రం మంచి వసూళ్లు రాబడుతోందని, గురువారంతో బ్రేక్‌ ఈవెంట్‌ అవుతుందన్నారు. ఇకపై వచ్చేదంతా లాభమేనని నిర్మాత చెప్పారు.

శివకార్తికేయన్‌ మాట్లాడుతూ మావీరన్‌ విజయం తనకు చాలా ప్రత్యేకం అన్నారు. తనకు మంచి యాక్టర్‌ అనిపించుకోవడం కంటే ఎంటర్‌టైనర్‌ అనిపించుకోవాలని కోరుకుంటానని, అది ఈ చిత్రంతో నెరవేరిందని అన్నారు. మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మళ్లీ నటించడానికి తాను సిద్ధం అని చెప్పారు. జయాపజయాలు మామూలే అని అయితే అభిమానుల సంతోషం కోసం ప్రేమిస్తూనే ఉంటానని శివకార్తికేయన్‌ పేర్కొన్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?