అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?
Breaking News
వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. మళ్లీ వచ్చేస్తోంది..!
Published on Thu, 01/01/2026 - 17:06
హారర్ చిత్రాలకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇలాంటి థ్రిల్లర్స్ ఎన్ని వచ్చినా ఆడియన్స్‌కు బోర్ అనిపించదు. అందుకే అలాంటి సినిమాలనే సీక్వెల్స్ సైతం తెరకెక్కిస్తున్నారు. తాజాగా మరో హారర్ మూవీ సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది. గతంలో రిలీజై ప్రేక్షకులను భయపెట్టిన డీమాంటి కాలనీ, డీమాంటీ కాలనీ-2 చిత్రాల గురించి మనందరికీ తెలిసిందే. ఈ సిరీస్‌లో మరోసారి ఆడియన్స్‌ను భయపెట్టేందుకు వచ్చేస్తున్నారు.
ఈ సూపర్ హిట్ సిరీస్‌లో డిమాంటీ కాలనీ-3 కూడా వచ్చేస్తోంది. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పంచుకున్నారు మేకర్స్. ఈ చిత్రంలో అరుల్ నిధి, ప్రియా భవానీశంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వచ్చిన రెండు పార్టులు ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టించాయి. ఈ మూవీపై కూడా అదేస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజైన పోస్టర్ చూస్తుంటే మరోసారి భయపెట్టడం ఖాయమని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రం కొత్త ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు.
Presenting the FIRST LOOK of #DemonteColony3 - “The End is Too Far” 😈👑
Get ready for the seat-edge experience in theatres, this SUMMER 2026 💥@arulnithitamil @AjayGnanamuthu @Sudhans2017 @PassionStudios_ @DangalTV @RDCMediaPvtLtd@SamCSmusic @sivakvijayan @gurusoms pic.twitter.com/T6lCCWlfLC— Priya BhavaniShankar (@priya_Bshankar) January 1, 2026
Tags : 1