Breaking News

విజయకాంత్ మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో!

Published on Thu, 12/28/2023 - 13:38

తమిళస్టార్ నటుడు, డీఎండీకే అధినేత మృతి పట్ల పలువురు సినీతారలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులర్పించారు. తాజాగా విజయ్‌కాంత్ మృతిపట్ల కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటనలో విశాల్ ఏడుస్తున్న వీడియో అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. 

విశాల్ వీడియోలో మాట్లాడుతూ..' కెప్టెన్ మరణించిన విషయం ఇప్పుడే నాకు తెలిసింది. ఈ వార్త విన్నాక నా కాళ్లు, చేతులు పనిచేయడం లేదు. కెప్టెన్‌ను కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆయన చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నా. నేను నడిగర్ సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు అండగా నిలిచారు. ఈ సమయంలో  వారి కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. విజయ్‌కాంత్‌ సార్‌కు ఇదే నా కన్నీటి నివాళి' అంటూ ఏడుస్తూ పోస్ట్ చేశారు.  

కాగా.. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్‌ బుధవారం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో మంగళవారం ఆస్పత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు చెన్నై మియాట్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు