Breaking News

విభిన్నమైన కథాంశంతో వస్తోన్న స్టార్ కమెడియన్..!

Published on Mon, 12/18/2023 - 15:17

నటుడు యోగిబాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బోట్‌. నటి గౌరీ జీ.కిషన్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి శింబు దేవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు వడివేలు హీరోగా హింసై అరసన్‌ 23 పులికేసి, విజయ్‌ హీరోగా పులి, ప్రకాష్‌ రాజ్‌, సంతానం, గంజా కరుప్పు ప్రధాన పాత్రలు పోషించిన అరై ఎన్‌ 305, రాఘవా లారెన్స్‌ హీరోగా నటించిన ఇరుంబు కోట్టై మురట్టు సింగం వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. కాగా ఈ తాజా చిత్రాన్ని భారీ అండ్‌ మాన్వీ మూవీ మేకర్స్‌ పతాకంపై ప్రభా ప్రేమ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ బోట్‌ పూర్తిగా వైవిధ్య భరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు.

ఇది 1940 ప్రాంతంలో చైన్నెలో జపాన్‌ బాంబులతో దాడి చేసినప్పుడు పదిమంది తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బోట్‌ ఎక్కి తప్పించుకునే ప్రయత్నం చేస్తారన్నారు. అందులో నటుడు యోగి బాబు ఒకరిని చెప్పారు. అయితే ఆ బోట్‌ సముద్ర మధ్యలో ఆగిపోవడం, రంధ్రం పడి నీరు బోట్‌లోకి రావడం వంటి పలు కష్టాలను ఎదుర్కొంటారన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేశారు ఎలా ప్రాణాలతో బయటపడ్డారు. వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రమని చెప్పారు. షూటింగ్‌ ఎక్కువ భాగం సముద్రంలో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు ఇది యాక్షన్‌, థ్రిల్లింగ్‌తో కూడిన పొలిటికల్‌ కామెడీ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం , కన్నడం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. కాగా.. ఈ జిబ్రాన్ సంగీతాన్ని, మాధేష్‌ మాణిక్యం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు