Breaking News

తప్పతాగిన నటుడు.. అర్ధనగ్నంగా కేకలు వేస్తూ.. వీడియో వైరల్!

Published on Tue, 01/21/2025 - 14:38

రజినీకాంత్ జైలర్ మూవీ పేరు వినగానే ఆయనే గుర్తుకు వస్తారు.  వర్త్ వర్మ వర్త్ అనే డైలాగ్‌తో అభిమానులను అలరించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం రజినీకాంత్‌ ఖాతాలో సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీలో తనదైన విలనిజంతో ఎంత ఫేమస్ అయ్యాడో అదే స్థాయిలో వివాదాల్లోనూ నిలిచారు. గతంలో వినాయకన్‌ని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. జీపులో స్టేషన్ కి కూడా తీసుకెళ్లారు. మద్యం ఫుల్‌గా తాగేసి పబ్లిక్ ప్లేసులో అసభ్యంగా ప్రవర్తించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఆ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

వీడియో వైరల్..

తాజాగా వినాయకన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఫుల్‌గా తాగి గట్టిగా అరుస్తూ ఆ వీడియోలో కనిపించారు. ఈ వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో  క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇందులో వినాయకన్ అర్ధనగ్నంగా కనిపించారు. అయితే ఈ వీడియో ఆయన ఇంట్లో బాల్కనీలో ఉండగా తీసినట్లు తెలుస్తోంది. విజువల్స్ చూస్తే ఎవరితోనో గొడవ పడుతున్నట్లు అర్థమవుతోంది. ఏదేమైనా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వినాయకన్‌ ప్రవర్తనపై నెటిజన్స్‌ మండిపడుతున్నారు. సినిమాల నుంచి అతన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లోనూ న్యూసెన్స్..

గతంలో జైలర్‌ నటుడు వినాయకన్‌ మద్యం మత్తులో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో హైదరాబాద్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తనను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని వాపోయాడు.  వినాయకన్‌.. కొచ్చి నుంచి హైదరాబాద్‌ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

కాగా మలయాళ నటుడైన వినాయకన్‌.. రజనీకాంత్‌ జైలర్‌ సినిమాలో వర్మ పాత్రతో మరింత పాపులర్‌ అయ్యాడు. పలు మలయాళ సినిమాల్లో నటించాడు. మలయాళ, తమిళ సినిమాల్లో చేస్తున్న వినాయకన్.. తెలుగులో కల్యాణ్ రామ్ 'అసాధ్యుడు'లో సెకండ్ విలన్‌గా నటించాడు. చివరిసారిగా ఇటీవల రిలీజైన ఉన్ని ముకుందన్ చిత్రం మార్కోలో కనిపించారు. 

 

 

Videos

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)