Breaking News

తెలుగులో ఆ సినిమాతోనే ఫేమ్.. ఇకపై ఆ పాత్రలు చేయను: సత్యరాజ్

Published on Mon, 09/30/2024 - 15:25

కట్టప్పగా తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు సత్యరాజ్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంతో కట్టప్పగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. తాజాగా ఆయన జీబ్రా మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన సత్యరాజ్‌ తెలుగు ఇండస్ట్రీలో తన ప్రస్థానంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సత్యరాజ్ మాట్లాడుతూ..'విలన్‌గానే నా కెరీర్ ప్రారంభించా. మిర్చి సినిమాతో తెలుగులో ఓ మంచి తండ్రిగా ఫేమస్ అయ్యాను. ఆ తర్వాత బాహుబలిలో కట్టప్పగా నటించా. ఇలాంటి పాత్రలు మళ్లీ చేసే అవకాశం రావడం చాలా అరుదు. మిర్చి మూవీతోనే తెలుగులో నాకు ఇమేజ్ వచ్చింది. ఇక నుంచి రెగ్యులర్ విలన్ పాత్రలు చెయ్యను. హీరో ముందు మోకరిల్లే పాత్రల్లో ఇకపై కనిపించను.' అని అన్నారు. 

(ఇది చదవండి: సత్యదేవ్‌ 'జీబ్రా' టీజర్‌ విడుదల)

సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జీబ్రా. ఈ ఏడాదిలో కృష్ణమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్‌.. ఇప్పుడు జీబ్రా అనే చిత్రంతో రానున్నాడు. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాలసుందరం, దినేష్‌ సుందరం ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రంలో జెన్నిఫర్‌ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్‌ అందించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)