Breaking News

ఆ రోజులు గుర్తొచ్చాయి

Published on Thu, 10/05/2023 - 05:55

 ‘‘రూల్స్‌ రంజన్‌’ పూర్తి వినోదాత్మక చిత్రం. ట్రైలర్‌ చూసి నవ్వుకున్నట్లే సినిమా అంతా  ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారని కచ్చితంగా చెప్పగలను’’ అని హీరో కిరణ్‌ అబ్బవరం అన్నారు. రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా కిరణ్‌ అబ్బవరం చెప్పిన విశేషాలు.

► ప్రతి సినిమాలో ఒకే తరహా పాత్ర కాకుండా వైవిధ్యంగా ఉండేలా కథలు ఎంచుకుంటున్నాను. రత్నం కృష్ణ చెప్పిన ‘రూల్స్‌ రంజన్‌’ కథ మంచి విజువల్‌ కామెడీ డ్రామాగా ఉంటుందని నమ్మి, చేశాను. రత్నం కృష్ణ బాగా తీశారు. సినిమా అంతా సరదాగా సాగుతుంది. ‘వెన్నెల’ కిశోర్, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు,  వైవా హర్ష, సుబ్బరాజు, ఆది ట్రాక్‌లు మంచి వినోదం పంచుతాయి.

► సినిమాల్లోకి రాకముందు చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేశాను. పల్లెటూరి నుంచి వెళ్లిన నాకు కెఫెటేరియా (క్యాంటీన్‌) అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆ వర్క్‌ కల్చర్, ఆఫీస్‌ పద్ధతులకు అలవాటు పడటం కష్టమైంది. ఈ చిత్రంలో మనోరంజన్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేశాను. షూటింగ్‌ చేస్తున్నప్పుడు నేను ఉద్యోగం చేసిన రోజులు గుర్తొచ్చాయి.

► నిర్మాతలు ఏఎం రత్నం, దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణగార్లు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా తీశారు. ఈ చిత్రంలోని ‘సమ్మోహనుడా..’ పాట హైప్‌ తీసుకు వచ్చింది. ఇది రొమాంటిక్‌ సాంగ్‌. అందుకే సవాల్‌గా అనిపించింది. ప్రస్తుతం సీనియర్‌ డైరెక్టర్స్‌తో రెండు, కొత్త దర్శకులతో రెండు సినిమాలు చేస్తున్నాను.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు