Breaking News

ఈ సినిమా క్లైమాక్స్‌ విని షాకయ్యాను: కిరణ్‌ అబ్బవరం

Published on Fri, 11/21/2025 - 01:41

‘‘రాజు వెడ్స్‌ రాంబాయి’ క్లైమాక్స్‌ విని,  షాక్‌ అయ్యాను. ఇలాంటి దారుణం కూడా జరిగిందా? ఇలా చేస్తారా? ఇలాంటి మనుషులు ఉంటారా? అనిపించింది. ఈ సినిమాను మిగతా వారికంటే ముందు పదిహేనేళ్లు ప్రేమకథను దాచిపెట్టిన ఆ ఊరివాళ్లు చూడాలి’’ అని హీరో కిరణ్‌ అబ్బవరం అన్నారు. అఖిల్‌ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్‌ రాంబాయి’.

సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్‌ ఒరిజినల్స్, డోలాముఖి సుబల్టర్న్‌ ఫిలింస్, మాన్‌సూన్‌ టేల్స్‌ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మించారు. నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు విడుదల చేస్తున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి అతిథిగా హాజరయ్యారు కిరణ్‌ అబ్బవరం. ‘‘ఒక ఊరు నేపథ్యంలో ఈ సినిమాను రూ పొందించాం’’ అన్నారు రాహుల్‌ మోపిదేవి.

వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మా సినిమా టిక్కట్‌ ధర కేవలం రూ.99 మాత్రమే ఉంటుంది. ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నం ఇది’’ అని పేర్కొన్నారు.  ‘‘ఉప్పెన’లో అమ్మాయి తండ్రి ఎలా ఉంటాడో చూసి ఉంటారు. ‘కోర్టు’ చిత్రంలో మంగపతిని చూశారు. ఆపాత్రలకు మించి ‘రాజు వెడ్స్‌ రాంబాయి’లో నేను చేసిన హీరోయిన్‌ తండ్రి వెంకన్నపాత్ర ఉంటుంది’’ అన్నారు చైతన్య జొన్నలగడ్డ.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)