ఎల్లుండే మెగా సునామీ?
దీపావళికి కె–ర్యాంప్
Published on Tue, 07/01/2025 - 01:24
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కె–ర్యాంప్(K-RAMP)’ ఈ దీపావళికి థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వంలో హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరు కుంది.
కాగా సోమవారం ‘కె–ర్యాంప్’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి, ఈ చిత్రాన్ని ఈ దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘‘కిరణ్ అబ్బవరం కెరీర్‌లో ‘కె–ర్యాంప్’ చిత్రం మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: చేతన్ భరద్వాజ్, సహ–నిర్మాత:జి. బాలాజీ.
#
Tags : 1