Breaking News

నాగార్జున సినిమాలో విలన్‌గా అందాల భామ

Published on Tue, 07/07/2026 - 09:32

టాలీవుడ్‌లో మన్మథుడు అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు కింగ్‌ నాగార్జున. మొన్నటి వరకు కుర్ర హీరోలు సైతం అసూయ పడేలా ఆన్‌స్క్రీన్‌పై రొమాన్స్‌ పండించాడు. అయితే ఈ మధ్య ఆయన తన పంథాను మార్చాడు. యాక్షన్‌ సినిమాలపై ఫోకస్‌ పెట్టాడు. తన 100వ సినిమా సినిమా పూర్తిగా యాక్షన్‌, ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండేలా ప్లాన్‌ చేసుకున్నాడు.తమిళ దర్శకుడు రా.కార్తీక్‌ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ‘కింగ్‌ 100’ అనే వర్కింగ్‌ టైటిల్‌ పెట్టారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్‌ కూడా పూర్తయింది. లాటరీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని భోగట్టా. అందుకే ‘లాటరీ కింగ్‌’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట.

ఈ చిత్రంలో టబు నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి మరింత అంచనాలు పెరిగాయి. గతంలో వీరిద్దరు కలిసి నటించిన ‘నిన్నే పెళ్లాడుతా’, ‘ఆవిడా మా ఆవిడే’ లాంటి సినిమాలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. వీరిద్దరి ఆన్‌స్క్రీన్‌  రొమాన్స్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ కూడా ఉంది. 

100వ సినిమాలోనూ వీరిద్దరి మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ ఉంటాయని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్‌ సమాచారం ఏంటంటే.. ఈ చిత్రంలో నాగార్జునతో టబు ఫైట్‌ చేయబోతుంది. ఆమె హీరోయిన్‌గా కాకుండా, నెగటివ్ షేడ్స్ ఉన్న అత్యంత పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారట. నాగార్జున, టబుల మధ్య వచ్చే యాక్షన్‌ సీన్స్‌ సినిమాకే హైలెట్‌గా నిలవనున్నాయని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)