Breaking News

కిచ్చా సుదీప్‌ ప్రైవేట్‌ వీడియో.. అతని పనేనా?

Published on Sat, 04/08/2023 - 09:19

కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌కు బెదిరింపు లేఖ వివాదం కర్ణాటక  రాజకీయాల్లో దుమారం లేపుతోంది. ఇటీవల ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.  బీజేపీకి సపోర్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే సుదీప్‌ ఇంటికి బెదిరింపు లేఖ వచ్చింది. ‘బీజేపీలో చెరితే నీ ప్రైవేట్‌ వీడియోలు, ఫోటోలు బహిరంగంగా ప్రజలందరి ముందు పెడతాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సీరియస్‌గా తీసుకున్న సుదీప్‌.. తన మేనేజర్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.  

అయితే ఇదంతా చేసింది సుదీప్‌ కారు డ్రైవరే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలే ఓ కారు డ్రైవర్ ను పనిలోనుంచి తీసేశారట సుదీప్‌. అతనే కక్ష్య పెంచుకొని ఈ పని చేసి ఉంటాడని సుదీప్ అండ్ టీమ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుదీప్ కారు డ్రైవర్ ను పట్టుకుంటే లేఖకు సంబంధించి పూర్తి వివరాలు బయటకొస్తాయని భావిస్తున్నారు పోలీసులు. అయితే  సుదీప్ ప్రైవేట్ వీడియో నిజంగానే అతడి దగ్గర ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తనకు సంబంధించిన ప్రైవేట్ వీడియో అతడి దగ్గర ఉండొచ్చని సుదీప్‌ కూడా అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు ఆ కారు డ్రైవర్‌ పరారీలో ఉండడం.. ఆ అనుమానాలకు మరితం బలం చేకూరినట్లైంది. అతని ఫోన్ కూడా స్విచాఫ్ లో ఉంది. ప్రస్తుతం కర్ణాటక పోలీసులు ఆ కారు డ్రైవర్‌ని వెతికే పనిలో పడ్డారని సమాచారం. అతను దొరికితేగానీ అసలు విషయం ఏంటో తెలుస్తుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)