Breaking News

ఫోన్‌ పేతో వివాదం.. కన్నడిగులకు మద్దతుగా సుదీప్‌

Published on Sun, 07/21/2024 - 14:58

కర్ణాటకలోని స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లను వ్యతిరేకించిన ఫోన్ పే సంస్థపై బహిష్కరణ ప్రచారం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఫోన్ పేపై కన్నడిగులు చేస్తున్న పోరాటానికి హీరో సుదీప్ మద్దతు తెలిపారు. ఫోన్ పేతో చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకోవాలని సుదీప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

కర్ణాటకలో ఉండే ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే  ప్రాముఖ్యత ఇవ్వాలని  అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. అయితే, దీనిని పోన్‌ పే సీఈవో సమీర్ నిగమ్ తప్పుబట్టారు.  దీంతో అక్కడి ప్రజల నుంచి ఫోన్‌ పే పట్ల తీవ్రమైన వ్యతిరేఖత వచ్చింది.

నటుడు సుదీప్ కర్ణాటకలో ఫోన్ పే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అక్కడ వినియోగదారులు డబ్బును పంపుతున్న సమయంలో 'థ్యాంక్యూ బాస్‌' అంటూ సుదీప్‌ వాయిస్‌ వినిపిస్తుంది. అయితే, కన్నడిగుల పట్ల ఫోన్‌ పే వ్యవహరించిన తీరుతో ఆ సంస్థ మీద అక్కడ ప్రజలు ఫైర​ అవుతున్నారు.   ఈ నేప‌థ్యంలో కిచ్చ సుదీప్‌ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకునేందుకు రెడీ అవుతున్నాడు.  తనను ఆదరించిన కన్నడిగుల పక్షాన నిలబడేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు సమాచారం.  కన్నడిగులకు క్షమాపణలు చెప్పకుంటే ఫోన్ పే సంస్థతో తాను చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  దీనిపై సుదీప్ రేపు అధికారికంగా తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

తమ ఫోన్లలో  ఫోన్ పే యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ క్యాంపెయిన్‌ను అక్కడి ప్రజలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కన్నడిగులకు సపోర్ట్‌ చేసేందుకు సుదీప్  ముందుకు వచ్చినట్లు  ఆయన టీమ్ నుంచి సమాచారం అందుతోంది.  అయితే, కన్నడిగులకు ఉద్యోగ రిజర్వేషన్లను చాలా మంది వ్యాపారవేత్తలు వ్యతిరేకించారు. దీంతో ఆయా పారిశ్రామికవేత్తలపై నిరసన కూడా వ్యక్తమైంది. ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లుకు వ్యతిరేకంగా ఫోన్ పే సీఈవో సమీర్ నిగమ్ మొదటగా వ్యతిరేకించారు.  అందుకే, కన్నడిగుల  అతనికి గుణపాఠం చెప్పాలని ప్రచారం జరుగుతోంది.

రిజర్వేషన్ల విషయంలో వెనక్కు తగ్గిన కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో గ్రూప్ సీ, డీ గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. అక్కడి పరిశ్రమవర్గాల నుంచి భారీగా వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దీనిపై మరింత లోతుగా పరిశీలించి రానున్న రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయ వెల్లడించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)