Breaking News

పదేళ్లు అయినా నా కోసం ఎదురు చూస్తున్నారు: కియారా అద్వానీ

Published on Tue, 10/24/2023 - 06:36

బాలీవుడ్‌ తారలు ఇప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమపై ఆసక్తి చూపుతున్నారనేది ఎవరు కాదనలేని నిజం. అక్కడి హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు సైతం సౌత్‌ ఇండియా పరిశ్రమలోని పలు చిత్రాల్లో నటించటానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ హీరోయిన్లు మాత్రం దక్షిణాది చిత్రాల అవకాశాలను ఏ మాత్రం వదులుకోవడం లేదు.

దీపిక పదుకొనే, కత్రినా కైఫ్‌, అలియా భట్‌, కంగనా రనౌత్‌ వంటి తారలు మన చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈ కోవలోకి నటి కియారా అద్వానీ చేరింది. బాలీవుడ్‌లో ఫుల్‌ డిమాండ్‌ ఉన్న హీరోయిన్‌. అక్కడ క్రేజీ కథానాయికగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌  గేమ్‌ చేంజర్‌ చిత్రంలో నటిస్తోంది. కాగా నటి కియారా అద్వానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూ పేర్కొంటూ తాను చేసే ఏ విషయంలోనైనా ఓ ప్రత్యేకత ఉండాలని భావిస్తానంది. నటించే చిత్రాల్లో తన పాత్రలు భిన్నంగా ఉండాలని కోరుకుంటానని పేర్కొంది.

చిత్రాలపై చాలామంది పెట్టుబడి, శ్రమ ఉంటాయని, అందుకే చిత్రాలు ఎంపికలో ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పింది. తన భర్త సిద్ధార్థ్‌కు చిత్రపరిశ్రమలో మంచి పేరు ఉందని, దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పింది. ఇకపోతే తాను నటిగా రంగ ప్రవేశం చేసి పదేళ్లు అయ్యిందని, ఇప్పుడు కూడా పలువురు తనతో చిత్రాలు చేయడానికి ఎదురు చూస్తూ ఉండడం చాలా ఆనందం కలిగిస్తోందన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)