Breaking News

బిడ్డకు జన్మనిచ్చిన 'కియారా అద్వానీ'

Published on Wed, 07/16/2025 - 07:15

బాలీవుడ్​ జంట కియారా అద్వానీ(Kiara Advani), సిద్ధార్థ్​ మల్హోత్ర తల్లిదండ్రులు అయ్యారు. ముంబయిలోని రిలయన్స్‌ ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు కియారా జన్మనిచ్చినట్లు బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వచ్చేశాయి. ఇదే సమయంలో ఈ జోడీకి సంబంధించిన స్నేహితులు కూడా శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలుస్తోంది. సుమారు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట ఇదే ఏడాది ఫిబ్రవరి 28న తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు.

2014లో సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ తెలుగులో 'భరత్‌ అనే నేను' మూవీతో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత వినయ విధేయ రామ, గేమ్‌ ఛేంజర్‌ వంటి భారీ చిత్రాల్లో ఆమె నటించారు. అయితే, 2021లో విడుదలైన ‘షేర్షా’లో సిద్ధార్థ్‌, కియారా నటించారు. అక్కడి నుంచి మొదలైన వారి పరిచయం ప్రేమగా మారింది. 2023 ఫిబ్రవరి 7న కుటుంబసభ్యుల సమక్షంలో రాజస్థాన్ జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్ వీరి వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. అయితే, వివాహం తర్వాత కూడా ఈ జోడీ సినిమాల్లో నటిస్తున్నారు.  కియారా నటించిన 'వార్‌ 2' ఈ ఆగష్టు 14న విడుదల కానుంది. ఆపై సిద్ధార్థ్‌ మల్హోత్రా, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన 'పరమ్‌ సుందరి' జులై 25న విడుదల కానుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)