Breaking News

డైరెక్టర్‌తో నయనతార గొడవ.. ఖుష్బూ క్లారిటీ

Published on Wed, 03/26/2025 - 11:44

ఖుష్బూ సుందర్‌ భర్త, ప్రముఖ దర్శకుడు సుందర్‌.సితో స్టార్‌ హీరోయిన్‌ నయనతార(Nayanthara) గొడవ పడిందనే రూమర్‌ గత మూడు,నాలుగు రోజులుగా తమిళ్‌ ఇండస్ట్రీలో బాగా వినిపించింది. సుందర్‌.సి దర్శకత్వంలో నయన్‌ ‘మూకుతీ అమ్మన్‌ 2’ అనే సినిమా చేస్తోంది. అయితే ఈ సినిమా సెట్‌లో  అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు, నయనతారకు గొడవ జరిగిందని, దీంతో సుందర్‌.సి షూటింగ్‌ నిలివేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు సుందర్‌తో కూడా నయన్‌ గొడవకు దిగినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై సుందర్‌ సతీమణి, నటి ఖుష్భూ(Khushbu Sundar) క్లారిటీ ఇచ్చింది.

‘మూకుతీ అమ్మన్‌ 2’(Mookuthi Amman 2) సినిమా గురించి సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్‌ను ప్రచారం చేసేవారు కాస్త ఆగమని కోరుతున్నా. సినిమా షూటింగ్ సాఫీగా జరుగుతోంది, ప్లాన్ చేసినట్లుగానే చిత్రీకరణ పూర్తవుతోంది. సుందర్‌ ఇలాంటి రూమర్స్‌ను ఎప్పుడూ పట్టించుకోరని అందరికీ తెలిసిందే. నయనతార అద్భుతమైన నటి, గతంలో ఆమె పోషించిన పాత్రను మళ్లీ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. దయచేసి ఈ సినిమా గురించి ఆధారం లేని రూమర్స్‌ను ఆపండి. అభిమానులు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు. మీ మద్దతు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నా. సుందర్‌.సి నుంచి మరో హిట్ కోసం ఎదురుచూడండి’ అని సుందర్‌ పోస్ట్ చేశారు. ఖుష్భూ ట్వీట్‌తో గత కొద్ది రోజులుగా వస్తున్న రూమర్స్‌కి అడ్డుకట్ట పడింది.

'మూకుత్తి అమ్మన్ 2' విషయానికొస్తే.. 2020లో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘మూకుత్తి అమ్మన్'(తెలుగులో అమ్మోరు తల్లి) సినిమాకు సీక్వెల్‌ ఇది. ‘మూకుత్తి అమ్మన్' చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం  వహించగా.. సీక్వెల్‌ని సుందర్‌.సి తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో నయనతారతో పాటు ఇనియా, రెజీనా కసెండ్రా, మైనా నందిని, దునియా విజయ్, సింగం పులి, యోగిబాబు  ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)