ఖైదీ– 2కి శ్రీకారం ఎప్పుడో..?

Published on Tue, 12/16/2025 - 06:47

తమిళసినిమా:  కొన్ని చిత్రాలు ఎప్పుడు తెరకెక్కుతాయో తెలియదు. అదే విధంగా కొన్ని చిత్రాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియదు. ఇటీవల నటుడు కార్తీ నటించిన, నటించనున్న చిత్రాల పరిస్ధితి ఇలానే ఉంది. కార్తీ హీరోగా లోకేశ్‌కనకరాజ్‌ దర్శకత్వం వహించిన తొలి  భారీ చిత్రం ఖైదీ. ఈ చిత్రంలో ముందు వేరే చిన్న నటుడు నటించాల్సి ఉంది. అయితే నిర్మాతలు అందులో నటుడు కార్తీ నటిస్తే చిత్రం పెద్దది అవుతుందని, ఆయన్ని నటింపజేశారు. ఆ చిత్రం సంచనలన విజయాన్ని సాధించింది. దీంతో  అప్పుడే ఖైదీకి సీక్వెల్‌ ఉంటుందని ప్రకటించారు. అయితే ఆ తరువాత దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్, నటుడు కార్తీ ఇతర చిత్రాలతో బిజీ అవడంతో ఖైదీ– 2 ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. 

అయితే త్వరలోనే మొదలవుతుందనే ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో లోకేశ్‌ కనకరాజ్‌ నటుడు రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కించిన కూలీ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో దర్శకుడిపై రకరకాల ట్రోలింగ్స్‌ వైరల్‌ అయ్యాయి. అదే విధంగా ఆయన కూడా హీరోగా అవతారమెత్తారు. ఆ చిత్రం తరుదాత టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ హీరోగా చిత్రం చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఖైదీ– 2 చిత్రం గురించి నటుడు కార్తీ ఓ భేటీలో పేర్కొంటూ ఆ చిత్రం ఇప్పుడే ప్రారంభం అయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇకపోతే ఈయన నటించిన తాజా చిత్రం వా వాద్ధియార్‌ ఈ నెల12న విడుదల కావలసి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్ర విడుదల వాయిదా పడింది. త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం.  

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)