Breaking News

KH233: కమల్‌ కొత్త సినిమా.. విక్రమ్‌కు మించేలా?

Published on Sat, 09/09/2023 - 08:29

తమిళసినిమా: కొందరి నటులను చూస్తుంటే మనసు ఉరకలేస్తుంటే వయస్సుతో పనేముంది అని అనకుండా ఉండలేం. నటుడు కమలహాసన్‌, రజనీకాంత్‌ వంటి వారు ఈ కోవకే చెందుతారు. విశ్వనటుడు కమలహాసన్‌ ఇటీవల విక్రమ్‌ చిత్రంతో సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజాగా జైలర్‌ చిత్రంతో రికార్డులను బద్దలు కొట్టారు. వీరిద్దరూ తమ చిత్రాల్లో గన్లు చేతపట్టి శత్రువుల గుండెల్లో గుండ్ల వర్షం కురిపించారు. తాజాగా నటుడు కమలహాసన్‌ తన 233 చిత్రానికి సిద్ధమయ్యారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కుమార్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈయన ఇంతకుముందు చతురంగం, ధీరన్‌ అధికారం ఒండ్రు, తుణివు బంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కమలహాసన్‌ చేస్తున్న చిత్రం గురించి ఈయన చాలా పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను చేసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా కమలహాసన్‌తో కలిసి రైతుల గురించి వారి జీవన విధానం గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇది రైతుల ఇతివృత్తంతో కూడిన రాజకీయ కథాచిత్రంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను గురువారం విడుదల చేశారు.

అందులో ఒకపక్క భారీ బుల్లెట్ల దృశ్యం, వివిధ రకాల గన్లు, కమలహాసన్‌ తుపాకీ చేతబట్టి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇది చూస్తుంటే కమలహాసన్‌ ఇంతకుముందు నటించిన విక్రమ్‌ చిత్రాన్ని మించే విధంగా ఈ తాజా చిత్రం ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీన్ని రూ.125 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు టాక్‌.

కాగా ఇందులో నటించే ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను ఇంకా వెల్లడించలేదు. అయితే ఇందులో మరోసారి విలన్‌గా విజయ్‌సేతుపతిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథాచిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు