Breaking News

కేసీఆర్‌కి టికెట్‌ ధరలు తగ్గించాం – రాకింగ్‌ రాకేష్‌

Published on Fri, 11/22/2024 - 02:03

‘‘ఈరోజు చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ మా ‘కేశవ చంద్ర రమావత్‌’ (కేసీఆర్‌)లో మాజీ సీఎం కేసీఆర్‌గారు నటించారు. అదే నా చిత్రానికి ఓపెనింగ్స్‌ తీసుకొస్తుంది. ఆయనకి తెలియకుండా ఆయన సన్నివేశాలు తీశాను. నేడు రిలీజ్‌ అవుతున్న అన్ని సినిమాలు చూడండి. అందులో నా ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. 

మా సినిమాకి టికెట్‌ ధరలు కూడా తగ్గించాం. రూ. 50 నుంచి వంద రూపాయలు మాత్రమే’’ అన్నారు రాకింగ్‌ రాకేష్‌. ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహించిన చిత్రం ‘కేసీఆర్‌’. రాకింగ్‌ రాకేష్‌ హీరోగా నటించి, నిర్మించారు. అనన్య కృష్ణన్‌ హీరోయిన్‌. 

ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా రాకింగ్‌ రాకేష్‌ మాట్లాడుతూ– ‘‘లంబాడీ కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు తన ఊర్లో జరుగుతున్న దారుణానికి చలించి, హైదరాబాదులో అడుగుపెట్టి, తన ఊరు కోసం ఏం చేశాడు? అవమానాలు పడ్డ ఊర్లో తను ఓ స్టార్‌గా ఎలా అయ్యాడు? అనేది కథ. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ కథ రాశాను. 

ఒక కమెడియన్‌ ఏ పాత్రనైనా చేయగలడు. ‘కేసీఆర్‌’ కథే నన్ను నటించేలా, నిర్మించేలా చేసింది. ఇది ఒక పార్టీని, ఒక వ్యక్తిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు. ఈ మూవీలో గోరటి వెంకన్నగారు రాసిన ఓ పాట నన్ను కేసీఆర్‌గారి దగ్గరికి తీసుకెళ్లింది. ఆయనకి మా సినిమా చూపించాలనేది నా ప్రయత్నం. నా భార్య జోర్దార్‌ సుజాత సహకారం లేకపోతే ఈ సినిమా పూర్తయ్యేది కాదు. నా కథని వంద రెట్లు అద్భుతంగా తెరకెక్కించారు అంజిగారు’’ అని తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)