Breaking News

దేశభక్తిని రగిలించే సినిమా.. తెలుగులో విడుదల

Published on Thu, 05/15/2025 - 09:20

జలియన్‌ వాలాబాగ్‌ విషాదం నేపథ్యంలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కేసరి చాప్టర్‌ 2’ (Kesari Chapter 2). ఏప్రిల్‌ 18న బాలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో కూడా విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మే 23న టాలీవుడ్‌లో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.  కరణ్‌ సింగ్‌ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ జలియన్‌ వాలాబాగ్‌ అనే ట్యాగ్‌లైన్‌ను చేర్చారు. మాధవన్‌, అనన్యపాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్‌ జోహార్‌ నిర్మించారు.  

అక్షయ్‌ కుమార్‌ నటించిన దేశభక్తి చిత్రాల్లో ‘కేసరి’ భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి కొనసాగింపుగా ‘కేసరి: ఛాప్టర్‌ 2’ను మేకర్స్‌ రూపొందించారు. ప్రముఖ రచయితలు రఘు, పుష్ప పలాట్‌ రచించిన ‘ది కేస్‌ దట్‌ షుక్‌ ది ఎంపైర్‌’ ఆధారంగా కరణ్‌ సింగ్‌ దీన్ని తెరకెక్కించారు. కేసరి చాప్టర్‌2 సినిమాకు కూడా బాలీవుడ్‌లో మంచి ఆదరణ లభించింది. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత దురదృష్టకర, హేయమైన సంఘటనగా నిలిచిపోయిన ఘటనల్లో జలియన్‌వాలా బాగ్‌ ఉదంతం ఒకటి. 1919 ఏప్రిల్‌ 13న అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. హిందీ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అయిన ఈ చిత్రం మే 23న తెలుగులో కూడా విడుదల కానుంది. గంతంలో ఛావా సినిమా కూడా మొదట హిందీలో విడుదలై ఆ తర్వాత తెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

దేశభక్తిని రగిలించే కోర్టు రూం డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను బ్రిటీష్‌ ప్రభుత్వం కచ్చితంగా చూడాలని అక్షయ్‌ కుమార్‌ గతంలో కోరారు. ఆ ప్రభుత్వంతో పాటు కింగ్‌ చార్లెస్‌ కూడా ఈ చిత్రాన్ని చూసి వారి తప్పులను ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించారు. ఈ సినిమా చూశాక వారు కచ్చితంగా క్షమాపణలు చెబుతారని ఆయన అన్నారు. 
 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)