CheviReddy: కూటమిపై తిరుగుబాటు.. రాబోయే స్థానిక ఎన్నికల్లో గుణపాఠం
Breaking News
ది కేరళ స్టోరీ సీక్వెల్.. టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ ఫిక్స్
Published on Fri, 01/30/2026 - 15:54
ఆదా శర్మ ప్రధాన పాత్రలో చిత్రం ది కేరళ స్టోరీ. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఏకంగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు గెలిచింది. ఈ చిత్రానికి గానూ సుదీప్తో సేన్‌కు ఉత్తమ దర్శకుడిగా అవార్డ్ అందుకున్నారు. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలోనూ అవార్డ్ వరించింది.
తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ది కేరళ స్టోరీ 2 - గోస్ బియాండ్' అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా టీజర్‌నువిడుదల చేశారు. పార్ట్-2కు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా, అదితి భాటియా కీలక పాత్రల్లో నటించారు. ఈ టీజర్ చూస్తుంటే ముగ్గురు హిందూ అమ్మాయిల జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు మహిళలు ఎలా మోసపోయారనే కోణంలో ఈ సినిమా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు.
కాగా.. 2023లో విడుదలైన 'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అదా శర్మ, సిద్ధి ఇద్నాని, యోగితా బిహాని, సోనియా బలాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ కేరళకు చెందిన కొంతమంది మహిళలు ఇస్లాంలోకి ఎలా మారారు అనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. కేరళలో కొన్నేళ్లుగా మహిళలు లవ్ జిహాద్ ఉచ్చులో చిక్కుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వారు అదృశ్యమైనట్లు వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తో సేన్ 'ద కేరళ స్టోరీ'ని తెరకెక్కించారు.
Tags : 1