Breaking News

బర్త్‌డే రోజే బాత్రూమ్‌లో విగతజీవిగా మోడల్‌, భర్తే చంపాడా?

Published on Fri, 05/13/2022 - 16:31

పుట్టినరోజే ఆమెకు ఆఖరి రోజయ్యింది. బర్త్‌డే రోజు తన కుటుంబాన్ని కలవాలన్న కోరిక కూడా తీరకుండానే ఆమె కన్నుమూసింది. కేరళ మోడల్‌ షహానా బర్త్‌డే నాడే మరణించింది. అయితే ఆమెది సాధారణ మరణమో, ఆత్మహత్యో కాదని, తన భర్తే చంపేసి ఉంటాడని సహానా కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే.. కేరళలోని కోజికోడ్‌కు చెందిన మోడల్‌, నటి షహానా మే 12న 21వ పుట్టినరోజు జరుపుకుంది. కానీ అదే ఆమె జీవితంలో ఆఖరి రోజుగా మారింది. అర్ధరాత్రి ఒంటిగంటకు షహానా చనిపోయిందంటూ కేసర్‌గాడ్‌లో నివసిస్తున్న తన కుటుంబీకులకు ఫోన్‌ వచ్చింది. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన ఆమె కుటుంబీకులు షహానా చావుకు ఆమె భర్తే కారణమని ఆరోపించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయం గురించి ఏసీపీ కె సుదర్శన్‌ మాట్లాడుతూ.. 'షహానా తమిళ ప్రాజెక్టులో నటించినందుకు ఆమెకు పారితోషికం ఇచ్చారు. దీనికోసం భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే షహానా బర్త్‌డే రోజు కూడా సజ్జద్‌ ఆలస్యంగా రావడంతో మరోసారి తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆ తర్వాత బాత్రూమ్‌లో ఆమె శవమై కనిపించింది. ఇది హత్యా? ఆత్మహత్యా? అన్నది విచారిస్తున్నాం' అని పేర్కొన్నాడు.

షహానా తల్లి మాట్లాడుతూ..  'నా కూతురు ఆత్మహత్య చేసుకోలేదు, ఆమెను చంపేశారు. అత్తారింట్లో తనను టార్చర్‌ పెడుతున్నారని నా కూతురు ఎప్పుడూ విలపించేది. ఆమె భర్త సజ్జద్‌ తాగొచ్చి నానా గొడవ చేసేవాడు. దీనికి తోడు అతడి తల్లిదండ్రులు, సోదరి కూడా నా కూతురికి నరకం చూపించేవారు. తన బాధ చూడలేక వేరు కాపురం పెట్టమని సూచించాను. కానీ సజ్జద్‌ డబ్బు కోసం పోరు పెడుతున్నాడని, దారుణంగా ప్రవర్తిస్తున్నాడని షహానా నా దగ్గర చెప్పుకుని వాపోయేది. ఆమె దగ్గరున్న 25 సవర్ల బంగారాన్ని అంతా వాడుకున్నారు. తన బర్త్‌డే రోజు మమ్మల్ని కలవాలనుకున్నా అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది' అంటూ బోరున ఏడ్చేసింది. కాగా షహానా పలు ఆభరణాల సంస్థల యాడ్స్‌లో నటించింది. ఏడాదిన్నర క్రితం సజ్జద్‌ను పెళ్లాడింది. అత్తింట్లో టార్చర్‌ భరించలేక కొద్ది రోజుల క్రితమే ఇంటి నుంచి బయటకు వచ్చేసి భర్తతో కలిసి అద్దెంట్లో నివసిస్తోంది.

చదవండి: పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించిన వర్మ, ఏమన్నాడంటే..

ముంబైలో కళ్లు చెదిరే ఫ్లాట్‌ కొన్న బుల్లితెర నటుడు

Videos

మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్

వంశీ ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు

మహానాడులో నో ఫుడ్.. అచ్చెన్నాయుడు ఎందుకొచ్చారు అంటారా ఏంటి!

మహానేడులో చందాలు వసూలు.. కాక బాధపడ్తున్న ఇంద్రబాబు

తెలుగు టాప్ డైరెక్టర్స్ తో వెంకటేష్ వరుస సినిమాలు

మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!

వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్..

వెళ్లిపోకండయ్యా.. బతిమాలుకుంటున్న బాబు

మహానాడు ఎఫెక్ట్.. డిపోల్లో బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు

Photos

+5

జోగి రమేష్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌.. నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం (ఫొటోలు)

+5

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్‌ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)

+5

వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్‌ జగన్ (ఫొటోలు)

+5

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు (ఫొటోలు)

+5

#GaddarAwards2024 : గద్దర్‌ అవార్డులు-2024 (ఫొటోలు)

+5

Miss world 2025 : ఆల్‌ ది బెస్ట్‌ మిస్‌ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)

+5

ట్రంప్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్‌కు మండింది (చిత్రాలు)

+5

విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

'సీతా పయనం' మూవీ టీజర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)