Breaking News

బీఫ్ బిర్యానీ, బుర్కాలో హీరోయిన్.. కేరళ హైకోర్టు కీలక నిర్ణయం

Published on Tue, 10/21/2025 - 17:16

కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద మలయాళ చిత్రం ‘హాల్’ను స్వయంగా వీక్షిస్తామని ప్రకటించింది. మలయాళ నటుడు షేన్ నిగమ్ నటించిన తాజా చిత్రం హాల్ వివాదంలో చిక్కుకుంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమాలోని బీఫ్, బిర్యానీ, బురఖా సన్నివేశాలపై  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది.

‘హాల్’ అనే చిత్రం ముస్లిం మహిళల జీవితం,వారి ఆహారపు అలవాట్లు, మతపరమైన ఆచారాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాను వీక్షించిన సీబీఎఫ్‌సీ ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని సూచించింది. ముఖ్యంగా బీఫ్ తినే సన్నివేశం, బురఖా ధరించిన మహిళల సంభాషణలతో పాటు పలు సున్నిత అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

తన సినిమాపై సీబీఎఫ్‌సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ చిత్రదర్శకుడు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఎఫ్‌సీ సాంస్కృతిక స్వేచ్ఛను హరిస్తుందని కోర్టులో తన వాదనలు వినిపించారు. ‘హాల్‌ ఒక సామాజిక కథ. మతాన్ని కించపరచడం కాదు. ముస్లిం మహిళల జీవితాన్ని నిజంగా చూపించడమే లక్ష్యం’అని పేర్కొన్నారు.

విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు న్యాయమూర్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హాల్‌ సినిమాను ఈనెల 25న స్వయంగా వీక్షిస్తామని తెలిపారు. న్యాయస్థానం ఈ చిత్రంలోని సన్నివేశాలు మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయా? లేదా? అన్నది పరిశీలించనుంది. సీబీఎఫ్‌సీ అభ్యంతరాలు సరైనవా? లేక సృజనాత్మక స్వేచ్ఛను అడ్డుకుంటున్నాయా? అనే అంశంపై సినిమా చూసిన తర్వాత తీర్పును వెలువరించనుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)