Breaking News

ఆ బార్‌తో నాకెలాంటి సంబంధం లేదు  

Published on Tue, 04/04/2023 - 06:55

నటిగా రంగప్రవేశం చేసిన తొలి రోజుల్లోనే మహానటి చిత్రంలో సావిత్రి పాత్రకు జీవం పోసి జాతీయ స్థాయిలో అవార్డు దక్కించకున్న నటి కీర్తి సురేష్. ఆ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తన పంథాను మార్చుకుని గ్లామర్‌ వైపు దృష్టి సారించింది. అయితే అలాంటి పాత్రలు ఈ అమ్మడికి సరిపడలేదనే విమర్శలు వచ్చాయి.

కీర్తీసురేష్‌ గ్లామరస్‌గా నటించిన చిత్రాల్లో సర్కారి వారి పాట చిత్రం మినహా మిగిలినవేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. దీంతో తమిళంలో అరుణ్‌ మాదేశ్వరన్‌ దర్శకత్వంలో నటించిన సాని కాగితం చిత్రం కీర్తికి మంచి పేరు తెచ్చిపెట్టింది. విషయం ఏమిటంటే ఇది డిగ్లామర్‌ పాత్రే. తనకు జరిగిన అన్యాయంపై బాగా ప్రతీకారాలతో రగిలిపోయే పాత్రను కీర్తి సురేష్‌ సమర్థంగా పోషించి ప్రశంసలు అందుకుంది.

అలా చిన్న గ్యాప్‌ తర్వాత మళ్లీ దసరా అనే తెలుగు చిత్రంలో డిగ్లామర్‌ పాత్రలో నటించి మరోసారి నటిగా తన పరిణితిని చాటుకుంది. ఇక అసలు విషయానికి వస్తే దసరా చిత్రంలో సిల్క్‌ బార్‌ మద్యం దుకాణం కీలకంగా ఉంటుంది. కాగా బార్‌ ముందు నటి కీర్తి సురేష్‌ ఫొటోలు దిగి వాటిని తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. అందులో సిల్క్‌ బార్‌ సెట్‌ను తొలగించే ముందు తాను దాని ముందు ఫోటోలు దిగాలని, అంతకంటే ఆ బార్‌కు  తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. దీంతో ఆమె ట్వీట్‌కు లైక్‌ల వర్షం కురుస్తోంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)