Breaking News

కీర్తి ఆశలన్నీ ఆ సినిమాపైనే.. హిట్‌ అయితే పెద్ద పండగే!

Published on Wed, 03/15/2023 - 12:26

బెస్ట్ యాక్టర్ అనిపించుకున్న ఏ స్టారైనా తన ఇమేజ్ కి తగ్గ స్టోరీస్ సెలెక్ట్ చేసుకోకపోతే ఇబ్బందులు పడాల్సిందే. ఆఫర్స్ వస్తున్నాయి కదా అని కథ పట్టించుకోకుండా నటిస్తే ప్రేక్షకులు ఆదరించరు. దీంతో ఇమేజ్ కి మాత్రమే కాదు కెరీర్ కి కూడా డ్యామేజ్ ఏర్పడే పరిస్థితి వస్తుంది. సేమ్ ఇలాంటి పరిస్థితిలోనే  కీర్తి సురేశ్‌ ఉంది. మహానటి లో నటించి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ఆఫర్ మిస్ చేయకుండా ప్రతి సినిమాలో నటించి బాక్సాపీస్ దగ్గర బోల్తా పడింది. 

మహానటి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయటానికే ఇంట్రెస్ట్ చూపించింది. అయితే కీర్తి నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి సినిమాలు ప్రేక్షకాదరణ పొందలేదు. గతేడాది తమిళంలో చేసిన సాని కాయిధమ్ లో మాత్రం కీర్తి సురేష్‌ నటనకి మంచి మార్కులే పడ్డాయి. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్‌ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ ఉంటుందనే చెప్పాలి. ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కావటంతో ప్రేక్షకులకి ఈ సినిమా గురించి ఎక్కువగా తెలియలేదు.

ఆ సినిమా తర్వాత కీర్తి కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవటానికి ట్రై చేసింది. మహేష్ బాబు మూవీ సర్కారు వారి పాటలో నటించింది. ఈ సినిమాలో తన అందం, నటనతో ప్రేక్షకులను కీర్తి ఆకట్టుకున్న కీర్తికి ఒరిగింది ఏమి లేదు. ఆ సినిమా క్రెడిట్ మొత్తం మహేశ్‌ కే వెళ్లిపోయింది. అయితే ఈ సారి తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని ఫిక్స్ అయిన కీర్తి...దసరా మూవీలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా నాని కి జోడిగా నటిస్తున్న కీర్తి సురేశ్‌ కూడా డీ గ్లామర్ రోల్ లోనే నటిస్తుంది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర వస్తే కీర్తి సురేశ్‌ ఏ రేంజ్ లో నటిస్తుందో అందరికీ తెలుసు. ప్రస్తుతం కీర్తి సురేశ్‌ పెర్ఫార్మెన్స్ బెస్డ్ రోల్ చేసిన దసరా పైనే ఆశలన్నీ పెట్టుకుంది. 

ఈ సినిమాలో వెన్నెల పాత్రలో కనిపించనున్న కీర్తి సురేశ్‌ కి ఫెర్ఫార్మెన్స్‌కు చాలా స్కోప్ ఉందట. ఈ విషయం ట్రైలర్ చూస్తే కూడా అర్ధమవుతోంది. పుష్ఫ సినిమాలో రష్మిక మందన్న నటించిన శ్రీవల్లి క్యారెక్టర్ ఎంత హైలైట్ అయిందో దసరా సినిమాలో కూడా వెన్నెల క్యారెక్టర్ అలా హైలైట్ అవుతుందని కీర్తి సురేశ్‌ గట్టిగా నమ్ముతుంది. ఈ సినిమాలో నాని, కీర్తి సురేష్‌ పోటీ పడి నటించారని చెబుతున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేల. అలాగే ఈ మూవీలోని  పవర్‌ఫుల్ సీన్స్‌ లో కీర్తి సురేశ్‌ పండించే ఎమోషన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయట.  ఈ సినిమా హిట్ అయితే కీర్తి సురేశ్‌ కి  పండగే అని నెటిజన్స్‌ అంటున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)