Breaking News

అంకుల్‌ అనొద్దన్నాడు.. కావాలంటే అలా పిలవమన్నాడు: కీర్తి సురేశ్‌

Published on Sat, 02/01/2025 - 13:21

బాలనటిగా వెండితెరకు పరిచయమైంది కీర్తి సురేశ్‌ (Keerthy Suresh). మలయాళంలో మూడు సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. గీతాంజలి సినిమాతో హీరోయిన్‌గా మారింది. నేను శైలజ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ పలు సినిమాలు చేసింది. ఇటీవలే బేబీ జాన్‌తో హిందీ బాక్సాఫీస్‌కు పరిచయమైంది.

అంకుల్‌ అని పిలవొద్దు
సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న కీర్తిని ఓ హీరో పిలిచి మరీ తనను అంకుల్‌ అని పిలవొద్దని చెప్పాడట! ఇంతకీ ఆ హీరో ఎవరంటే మలయాళ నటుడు దిలీప్‌. 2002లో దిలీప్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం కుబేరన్‌. ఇందులో అతడు ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకుంటాడు. అందులో ఒకరు కీర్తి సురేశ్‌. దిలీప్‌ కూతురిగా నటించిన కీర్తి.. తర్వాతికాలంలో అతడి ప్రేయసిగా నటించింది. రింగ్‌ మాస్టర్‌ (2014) మూవీలో దిలీప్‌ గర్ల్‌ఫ్రెండ్‌గా యాక్ట్‌ చేసింది. హీరోయిన్‌గా ఇది ఆమెకు రెండో సినిమా. 

రింగ్‌ మాస్టర్‌ సినిమాలో దిలీప్‌తో కీర్తి సురేశ్‌

ఆయన కూతురిగా, ప్రేయసిగా..
ఈ విషయాన్ని కీర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. దిలీప్‌ (Dileep) సరసన హీరోయిన్‌గా నటించేందుకు ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన్ను చూస్తూనే ఉన్నాను. తనేమీ మారలేదు, అలాగే ఉన్నాడు. రింగ్‌ మాస్టర్‌ మూవీలో నేనే తన గర్ల్‌ఫ్రెండ్‌ అని తెలియగానే నన్ను పిలిచి ఓ మాట చెప్పారు. చిన్నప్పుడు అంకుల్‌ అని పిలిచేదాన్నని.. అలా మాత్రం పిలవొద్దని కోరాడు. కావాలంటే చేట్ట (అన్నయ్య) అని పిలవమన్నాడు. నేను వెంటనే సరే చేట్ట అన్నాను. రింగ్‌మాస్టర్‌ నా మొదటి హిట్‌ సినిమా అని చెప్పుకొచ్చింది.

పేరెంట్స్‌ సలహా
పేరెంట్స్‌ మేనక-సురేశ్‌ కుమార్‌ గురించి చెప్తూ.. 'సినిమాల్లోకి వచ్చేస్తానన్నప్పుడు అమ్మానాన్న నాకు కొన్ని సలహాలిచ్చారు. సమయపాలన పాటించాలని అమ్మ చెప్పేది. తను సమయానికి సెట్‌లో ఉంటానని నేను కూడా దాన్ని అనుసరించాలని నొక్కి చెప్పింది. సెట్‌లో పనిచేసేవాళ్ల దగ్గరనుంచి డైరెక్టర్‌ వరకు అందరికీ ఒకేరకమైన గౌరవం ఇవ్వాలంది.

అదే చాలా కష్టం
ఇండస్ట్రీలో నేను మంచి పేరు సంపాదించుకున్నాను. దాన్ని అలాగే కాపాడుకోవాలని నాన్న చెప్పాడు. మా ఇంట్లోని వాళ్లందరూ మంచి విమర్శకులు. అమ్మానాన్న కంటే కూడా నా సోదరి నుంచి ప్రశంసలు అందుకోవడం అత్యంత కష్టతరమైన విషయం. నేనేంటో నిరూపించుకోవాలి, వాళ్ల దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను' అని కీర్తి చెప్పుకొచ్చింది.

చదవండి: క్యూట్‌ గెటప్‌లో అల్లు అర్హ, అయాన్‌ డ్యాన్స్‌..

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)