రూ.1 కోటి ప్రశ్నకు కరెక్ట్‌ గెస్‌.. కానీ రూ.50 లక్షలే గెలిచింది!

Published on Sat, 12/14/2024 - 18:34

Kaun Banega Crorepati (KBC): కౌన్‌ బనేగా కరోడ్‌పతి (మీలో ఎవరు కోటీశ్వరుడు).. అతి సామాన్యులను కూడా కోటీశ్వరులను చేసే షో! అందుకే దీనికి విశేషమైన అభిమానులున్నారు. హిందీలో పదిహేను సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం పదహారో సీజన్‌ నడుస్తోంది. తాజా ఎపిసోడ్‌లో పంకజిని దశ్‌ అనే మహిళ పాల్గొంది. హోస్ట్‌ అమితాబ్‌ బచ్చన్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ పోయింది.

రూ.1 కోటి విలువైన ప్రశ్న
రూ.50 లక్షల విలువైన ప్రశ్నకు కూడా ఎటువంటి లైఫ్‌లైన్స్‌ వాడకుండా కరెక్ట్‌ సమాధానం చెప్పింది. చివరగా రూ.1 కోటి విలువైన ప్రశ్న అడిగాడు బిగ్‌బీ. 1997లో క్వీన్‌ ఎలిజబెత్‌ 2 భారత్‌కు వచ్చినప్పుడు కిందివాటిలో కమల్‌ హాసన్‌ నటించిన ఏ సినిమా సెట్‌ను సందర్శించింది? అని క్వశ్చన్‌ వేశాడు. అయితే ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందన్నాడు. దీనికి ఎ. చమయం, బి. మరుదనయగం, సి. మార్కండేయన్‌, డి.మర్మయోగి అన్న ఆప్షన్లు ఇచ్చాడు.

ఆట ఆపేశాక కరెక్ట్‌ గెస్‌!
ఈ ప్రశ్నతో ఆలోచనలో పడిపోయింది పంకజిని. తప్పు సమాధానం చెప్తే ఇప్పటిదాకా గెలుచుకుంది కూడా పోతుందనే ఉద్దేశంతో ఆటను అక్కడితో ఆపేసింది. అయితే ఆమెకున్న లైఫ్‌లైన్లతో ఏవైనా రెండు ఆప్షన్లను ఎంచుకోమన్నాడు బిగ్‌బీ. అందుకామె బి,సి అన్న ఆప్షన్లు సెలక్ట్‌ చేసుకుంది. బి. మరుదనయగం కరెక్ట్‌ ఆన్సర్‌ అని బిగ్‌బీ తెలిపాడు. అయితే ఈ ప్రశ్నకుముందు ఆమె గేమ్‌ ఆపేస్తున్నట్లు చెప్పడంతో రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుని వెళ్లిపోయింది.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)