Breaking News

ప్రభాస్‌తో కత్రినా.. సందీప్‌ రెడ్డి ప్లాన్‌ అదిరిందిగా!

Published on Wed, 07/22/2026 - 11:35

‘యానిమల్’తర్వాత సందీప్‌రెడ్డి వంగా ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఆ ఒక్క సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌ డైరెక్టర్‌ అయిపోయాడు. ఆ తర్వాత వెంటనే ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ సినిమా అనౌన్స్‌ చేశాడు. అప్పటి నుంచి ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ అంచనాలను తగ్గట్లుగానే సందీప్‌ రెడ్డి వంగా అనౌన్స్‌మెంట్స్‌ ఉంటున్నాయి. 

తొలుత ఈ మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకొణెను అనుకున్నాడు. ఈ మేరకు అనౌన్స్‌మెంట్‌ కూడా చేశారు. కానీ ఆమె పెట్టిన కండీషన్స్‌ నచ్చక..దీపిక స్థానంలో త్రిప్తి దిమ్రిని తీసుకున్నాడు. షూటింగ్‌ కూడా ప్రారంభించాడు. ఇప్పటికే 40 శాతం పూర్తయింది కూడా. ఈ విషయాన్ని తాజాగా ఓ ఈవెంట్‌లో స్వయంగా సందీప్‌ రెడ్డినే చెప్పాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ గాసిప్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ డార్క్‌ యాక్షన్‌ ఎంటర్‌నర్‌లో మరో బాలీవుడ్‌ భామ కూడా నటించబోతుందట. ఓ కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్‌ క్వీన్‌ కత్రినా కైఫ్‌ని రంగంలోకి దించేందుకు సందీప్‌ రెడ్డి ప్లాన్‌ చేస్తున్నాడట. ఇప్పటికే ఆమెను సంప్రదించి.. కథ వినిపించాడట. పాత్ర నచ్చడంతో కత్రినా కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిందట. ఆమె పాత్రకు కేవలం రెండు రోజుల షూటింగ్‌ మాత్రమే ఉంటుదంట. అలా అని క్యామియో రోల్‌ కాదు. కథను మొత్తం పూర్తిగా మార్చేసే పాత్ర అట. అందుకే నిడివి తక్కువైనా కత్రినా ఓకే చెప్పిందట. దీనికి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

మొత్తానికి సందీప్‌ అయితే పెద్ద ప్లానే వేశాడు. చిన్న చిన్న పాత్రల కోసం కూడా స్టార్స్‌ని పెడుతున్నాడు. ఐశ్వర్య దేశాయ్‌ కూడా ఓ పాత్ర చేస్తుంది.  విలన్ గా వివేక్ ఒబేరాయ్‌ నటిస్తున్నాడు.  ఈ సినిమా కోసం తొలిసారి ΄పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు ప్రభాస్‌. వచ్చే ఏడాది మార్చి 5న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)