Breaking News

నయన్‌ను టార్గెట్‌ చేసిన నటి, నెట్టింట దుమారం రేపుతున్న ట్వీట్‌

Published on Mon, 10/10/2022 - 12:09

సీనియర్‌ నటి కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఆమె చేసే రచ్చ అంతా ఇంత కాదు. వివాస్పద ట్వీట్స్‌ చేస్తూ తరచూ ఆమె వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె మరోసారి సంచలన ట్వీట్‌ చేసి వార్తల్లోకెక్కింది. భారతదేశంలో సరోగసిని బ్యాన్‌ చేశారంటూ ఆమె చేసిన ట్వీట్స్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచింది. ‘ఇండియాలో సరోగసీపై నిషేధం విధించారు. వైద్యపరంగా అనివార్య కారణాల కోసం తప్ప.. సరోగసీని ప్రోత్సాహించకూడదు. ఈ చట్టం జనవరి 2022 నుంచి అమల్లోకి వచ్చింది.

చదవండి: మనోజ్‌ సెకండ్‌ మ్యారేజ్‌పై మంచు లక్ష్మి షాకింగ్‌ రియాక్షన్‌

దీని గురించి మనం రాబోయే రోజుల్లో చాలా వినబోతున్నాం’ అంటూ కస్తూరి ఆమె తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. అయితే లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార తల్లయిన విషయం ప్రకటించిన అనంతరం కాసేపటికే ఆమె ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం. జూన్‌ 9న ప్రియుడి విఘ్నేశ్‌ శివన్‌తో ఏడడుగులు వేసిన నయన్‌ ఆదివారం(అక్టోబర్‌ 9న) కవలకు తల్లయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె సరోగసి ద్వారా కవలకు జన్మనిచ్చిందని అందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో నటి కస్తూరి సరోగసిపై  ట్వీట్‌ చేయడంతో ఆమె నయన్‌ను టార్గెట్‌ చేసిందని అందరు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: ఈ దీపావళికి థియేటర్లో సందడి చేయబోతున్న చిత్రాలివే

దీంతో నయన్‌ ఫ్యాన్స్‌ కస్తూరిపై మండిపడుతున్నారు. ‘ఇప్పుటి రోజుల్లో లా(Law)ని ఎవరు ఫాలో అవుతున్నారు?’, ‘ఎవరి జీవితం వారిది.. మీకేందుకు, మీ పని మీరు చూసుకోండి’, ‘ఇప్పుడు ఈ ట్వీట్‌ చేసి ఎవరిని భయపెడుతున్నారు.. ఎదుటి వాళ్లు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారా?’ అంటూ ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. ఈ విమర్శలకు సైతం ఆమె స్పందిస్తూ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. నా పని నన్ను చూసుకో అని చెప్పిన వారందకి ఇదే నా సమాధానం. ‘లాయర్‌గా పట్టా పొందిన ఓ వ్యక్తిగా చట్టపరమైన అంశాలను విశ్లేషించే హాక్కు ఉంటుంది’ అంటూ ట్రోలర్స్‌కు కౌంటర్‌ ఇచ్చింది. 

Videos

చైనాకు దగ్గరవుతోన్న భారత్? టిక్ టాక్ రీ ఎంట్రీ.. నిషేధంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

7 కోట్ల స్థలం 50 లక్షలకే.. ఆంధ్రజ్యోతికి ఇవ్వాలనుకొని బొక్క బోర్లాపడ్డ టీడీపీ

పాఠశాలలో పిల్ల ఏనుగు

కుక్కలతో మాట్లాడుతున్న రాజేష్

ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. నారా రోహిత్ షాకింగ్ రియాక్షన్

అరుణ నోరు తెరిస్తే బండారం బయటపడుతుందని హోంమంత్రి అనితకు భయం

అమెరికా వీసా ఇమ్మిగ్రేషన్ విధానాలు మరింత కఠినతరం

జేమ్స్ కామెరాన్ చేతిలో SSMB29 ప్రమోషన్స్

అమెరికాలోని పెంబ్రోక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అబ్బయ్య చౌదరిని చంపితే? వెయ్యి మంది అబ్బయ్య చౌదరిలు వస్తారు.. పేర్ని నాని సంచలన కామెంట్స్

Photos

+5

ప్రభాస్ ఫస్ట్‌ హీరోయిన్‌ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)

+5

'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్‌ గ్లింప్స్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా..?

+5

#HBDChiranjeevi : 70 ఏళ్ల గాడ్‌ ఫాదర్‌.. 'చిరంజీవి' బర్త్‌డే స్పెషల్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి శ్రియా శరణ్ (ఫొటోలు)