Breaking News

Kartikeya Gummakonda: ప్రేక్షకులు అప్పుడే హీరోలా చూస్తారు

Published on Thu, 05/30/2024 - 06:13

‘‘ఇప్పుడున్న నా ఇమేజ్‌కు సరైన మూవీ ‘భజే వాయు వేగం’. హీరో అంటే మనం ΄ోల్చుకునేలా ఉండాలి. అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు ఎంచుకునే మార్గాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలని భావిస్తాను. అప్పుడే అతన్ని ప్రేక్షకులు హీరోలా చూస్తారు. హీరోగా నాకు కొంచెం సామాజిక బాధ్యత ఉంది. అది నేను చేసే పాత్రల మీద రిఫ్లెక్ట్‌ అవుతుంటుంది’’ అని హీరో కార్తికేయ గుమ్మకొండ అన్నారు. 

ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన చిత్రం ‘భజే వాయు వేగం’. ‘హ్యాపీ డేస్‌’ ఫేమ్‌ రాహుల్‌ టైసన్‌ కీలక పాత్ర చేశారు. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం రేపు రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ– ‘‘లాక్‌ డౌన్‌ టైమ్‌లో ‘భజే వాయు వేగం’ కథ వినిపించాడు ప్రశాంత్‌ రెడ్డి. 

ఈ కథ వినగానే కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ టైపులో ఊహించుకున్నాను. ‘ఖైదీ’లో ఉన్నంత యాక్షన్‌ ఉండదు కానీ, హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, లవ్‌ అన్నీ కుదిరాయి. యూవీ క్రియేషన్స్‌లో సినిమా అనగానే మేకింగ్, ΄ోస్ట్‌ ్ర΄÷డక్షన్, రిలీజ్‌ అన్నీ సరిగ్గా జరుగుతాయనే నమ్మకం వచ్చింది. ‘భజే వాయు వేగం’లో ఫస్టాఫ్‌లో ఎమోషన్‌ ఉన్న హీరోను చూస్తారు.

సెకండాఫ్‌లో ఆ ఎమోషన్‌ వల్ల ఎలాంటి స్టెప్స్‌ తీసుకున్నాడనేది చూపించాం. ఈ సినిమా క్రెడిట్‌ వంద శాతం దర్శకుడిదే. హీరోగా చేస్తున్న టైమ్‌లో ‘గ్యాంగ్‌ లీడర్, వలిమై’ చిత్రాల్లో విలన్‌గా నటించినందుకు ఫీల్‌ అవడం లేదు. ఆ సినిమాల ద్వారా నాకు అమెరికాలో, తమిళ పరిశ్రమలో గుర్తింపు దక్కింది. ‘గ్యాంగ్‌ లీడర్‌’ తర్వాత తెలుగు, తమిళంలో విలన్‌గా చాన్స్‌ వచ్చినా పాత్రలు నచ్చక చేయలేదు. నా తర్వాతి సినిమాని కూడా ప్రశాంత్‌ రెడ్డితోనే చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. 

Videos

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

మజ్జి శ్రీనివాసరావు TDPలో చేరికపై కొండ రాజీవ్ స్ట్రాంగ్ రియాక్షన్

యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు..

అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

ఇది పద్దతి కాదు.. కేటీఆర్ పై స్పీకర్ సీరియస్

వైభవ్..నువ్వు సూపర్ రా! బుడోడిపై ఇషాన్ ప్రశంసలు

అడ్డంగా ఇరుక్కున్నాక లోకేశ్ వాయిస్ లో బేస్ తగ్గింది..

అంతర్జాతీయంగా దుమారం రేపుతున్న ట్రంప్ పోస్ట్

ఇన్వెస్టర్లకు బిగ్ అప్ డేట్.. కొత్త ట్రేడింగ్ రూల్స్ ఇవే!

Photos

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)