Breaking News

అలాంటి కార్తీనే ఇష్టపడుతున్నారు! 

Published on Fri, 11/03/2023 - 02:28

‘‘చేసిన పాత్రలనే మళ్లీ చేస్తే నాకు బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడు వినూత్నంగా, ప్రయోగాత్మకంగా సినిమాలు చేసే కార్తీనే ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. అంటే నేను నాలా ఉంటే ఆదరిస్తున్నారు. మరొకరిలా ఉండాలనుకోవడం లేదు. కాబట్టి నా తరహా సినిమాలే నేను చేస్తాను’’ అని కార్తీ అన్నారు.

కార్తీ హీరోగా ‘జోకర్‌’ ఫేమ్‌ రాజు మురుగన్‌ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ‘జపాన్‌’ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ రిలీజ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో కార్తీ చెప్పిన విశేషాలు.

∙‘జపాన్‌’ క్యారెక్టర్‌ బేస్డ్‌ ఫిల్మ్‌. నిజమైన కథ కాదు. కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను రూ΄పొందించాం. ఈ సినిమా కేవలం వినోదం ఇవ్వడం మాత్రమే కాదు... మన ఉనికిని, అస్థిత్వాన్ని ప్రశ్నించేలా కూడా ఉంటుంది. ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. సోషల్‌ మీడియా అంశాన్ని కూడా టచ్‌ చేశాం. అలాగే మనకు ‘జపాన్‌’ అంటే హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు దాడి గుర్తుకు రావచ్చు. ఆ దాడి తర్వాత జపాన్‌ దేశం మళ్లీ పుంజుకుని అత్యున్నత స్థాయికి ఎదిగింది. ఈ రిఫరెన్స్‌ ‘జపాన్‌’ పాత్రలో కూడా కనిపిస్తుంది.

చాలా కాలం తర్వాత మాస్‌తో కూడిన స్ట్రాంగ్‌ అండ్‌ సెటైరికల్‌ రోల్‌ నాకు మళ్లీ ‘జపాన్‌’తో వచ్చినట్లు అనిపించింది. ‘జపాన్‌’ గ్రే క్యారెక్టర్‌ కాదు.. డార్క్‌ అంతే. నా క్యారెక్టర్‌లో డార్క్‌ హ్యూమర్‌ ఉంటుంది. ‘జపాన్‌’ కోసం రెగ్యులర్‌ కార్తీలా ఉండకూడదని అనుకున్నాను. దర్శకుడు కూడా ఇదే కోరుకున్నారు. ఈ సినిమా కోసం కొత్తగా మేకోవర్‌ అయ్యాను. నా వాయిస్‌ మాడ్యులేషన్, హెయిర్‌ స్టయిల్‌ అన్నీ కొత్తగా అనిపిస్తాయి.

నేను నటించిన ‘ఊపిరి’ సినిమా తమిళ వెర్షన్‌కు దర్శకులు రాజు ముగరున్‌ డైలాగ్స్‌ రాశారు. ఆయనలో మంచి హ్యూమర్‌ ఉందని ఆ సమయంలో అనిపించింది. కానీ రాజుగారు తీసిన ‘కుకు’, ‘జోకర్‌’ సినిమాల్లో ఇది అంతగా లేదు. సాధారణంగా నేను నా కోసం ఏవైనా కథలు ఉన్నాయా? అని ఎవర్నీ అడగలేదు. తొలిసారి రాజు మురుగన్‌ని అడిగాను. ఓ డార్క్‌ ఎమోషనల్‌ స్టోరీ చెప్పారు. నాకు అంతగా నచ్చలేదు. ఆ తర్వాత మరో కథలోని ఓ క్యారెక్టర్‌ నచ్చి, ఆ పాత్ర ఆధారంగా కథ రాయమన్నాను. అలా ‘జపాన్‌’ కథ మొదలైంది.

రాజు మురుగన్‌గారు గతంలో జర్నలిస్ట్‌గా చేశారు. ఆయన తన జీవితంలో చూసిన కొన్ని ఘటనలను ‘జపాన్‌’లో చూపించే ప్రయత్నం చేశారు. అలాగే నాగార్జునగారి అన్నపూర్ణ స్టూడియోస్‌తో అసోషియేట్‌ అవ్వడం ఆనందంగా ఉంది. ∙దర్శకుడు నలన్‌కుమార్‌తో నేను చేస్తున్న సినిమా 70 శాతం షూటింగ్‌ పూర్త యింది. ‘96’ ఫేమ్‌ ప్రేమ్‌కుమార్‌తో ఓ సినిమా చేయనున్నాను. అలాగే ‘ఖైదీ 2’, ‘సర్దార్‌ 2’ చిత్రాలు చేయాల్సి ఉంది.

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)