Breaking News

ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి: కార్తీ

Published on Tue, 09/24/2024 - 02:54

‘‘కె.విశ్వనాథ్‌గారి సినిమాలంటే నాకు ఇష్టం. కానీ,  ఇప్పుడు అలాంటి కథలు రావడం లేదు. అయితే ‘సత్యం సుందరం’ కథ చదివినప్పుడు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఇలాంటి స్క్రిప్ట్‌ ఎలా రాస్తారా? అనిపించింది. ఈ సినిమా తప్పకుండా కె.విశ్వనాథ్‌గారి తరహా లాంటి ఒక మంచి చిత్రం అవుతుందనిపించింది’’ అని కార్తీ అన్నారు. ‘96’ మూవీ ఫేమ్‌ సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో కార్తీ, అరవింద్‌ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’.  2డి ఎంటర్‌టైన్ మెంట్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన  ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదల కానుంది. ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్ మెంట్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కార్తీ విలేకరులతో పంచుకున్న విశేషాలు...

⇒ మనలోని చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే కథ ‘సత్యం సుందరం’. నాకు కథ బాగా నచ్చడంతో అన్నయ్యకి(హీరో సూర్య) చె΄్పాను. ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత అన్నయ్య, వదిన(జ్యోతిక) నిర్మించారు. ఇలాంటి మంచి సినిమాకి పారితోషికం ఎక్కువ అడగొద్దు అంటూ నా మార్కెట్‌ కంటే కొంచెం తగ్గించి ఇచ్చారు(నవ్వుతూ). నా తొలి చిత్రం ‘పరుత్తి వీరన్‌’ సినిమా చూసి ఆ΄్యాయంగా హత్తుకున్న అన్నయ్య మళ్లీ ఇన్నేళ్లకు ‘సత్యం సుందరం’ లో చాలా బాగా నటించానంటూ గర్వంగా హత్తుకున్నారు. 

⇒ బ్రదర్స్‌ లాంటి రెండు క్యారెక్టర్స్‌ మధ్య నడిచే కథ ఇది.‘సాగర సంగమం’ సినిమా చూసినప్పుడు ఎలాంటి అద్భుతమైన అనుభూతి కలిగిందో ‘సత్యం సుందరం’ చూస్తున్నప్పుడు కూడా అలాంటి ఓ మంచి అనుభూతిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. అయితే కె.విశ్వనాథ్‌గారి సినిమాలు కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్సే. మా సినిమా కూడా అలాంటిదే. ఈ చిత్రం చూశాక అందరికీ తమ బాల్యం గుర్తొస్తుంది. 

⇒ చిన్న పల్లెటూరిలో చీరల దుకాణం నడిపే అమాయకమైన వ్యక్తిత్వం ఉండే పాత్ర నాది. ఈ మూవీలో అరవింద్‌ స్వామిగారు కాకుండా ఆయన పాత్రలో మరొకర్ని ఊహించలేం. ‘ఊపిరి’ సినిమాలో ఉన్నట్లు సంతోషకరమైన భావోద్వేగాలున్న కథ ఇది. మా సినిమా తమిళంలో ఈ నెల 27న విడుదలవుతోంది.అయితే అదేరోజు తెలుగులో ‘దేవర’ లాంటి పెద్ద సినిమా ఉంది. అందుకే మా సినిమాని 28న రిలీజ్‌ చేస్తున్నాం. ‘దేవర’ ఒక యుద్ధంలా ఉంటుంది. మాది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమా(నవ్వుతూ). 

⇒ ‘సత్యం సుందరం’ కి గోవింద్‌ వసంత్‌ పాటలు, నేపథ్య సంగీతం బాగుంటాయి. సునీల్‌, సురేశ్‌ బాబుగార్లు మా సినిమా రిలీజ్‌ చేయడం హ్యాపీ. ‘ఊపిరి’ తర్వాత తెలుగులో నేరుగా సినిమా చేయలేదు. కథలు వింటున్నాను. తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం ‘సర్దార్‌ 2’ షూటింగ్‌ జరుగుతోంది. అలాగే ‘వా వాతియారే’ సినిమా ఉంది. ‘ఖైదీ 2’ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)