Breaking News

టాలీవుడ్‌లో దూసుకెళ్తున్న ‘కాంతార’.. తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే..

Published on Sun, 10/16/2022 - 13:46

‘కేజీయఫ్‌’తర్వాత కన్నడ చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో అలరిస్తున్నాయి. శాండిల్ వుడ్ చిత్రాలపై యావత్‌ భారత్‌ సీనీ ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. అందుకే కన్నడ మేకర్స్‌ పాన్‌ ఇండియా స్థాయి సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కొన్ని చిత్రాలు మాత్రం కన్నడ ప్రేక్షకుల కోసమే రూపొందిస్తుంటే.. అవి కూడా మిగతా భాషల ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా చిన్న చిత్రాలు కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన తాజా కన్నడ చిత్రం ‘కాంతార’.ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది.

(చదవండి: బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన ‘కాంతర’ బడ్జెట్‌ ఎంతో తెలుసా..?)

తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది.  శనివారం(అక్టోబర్‌ 15)టాలీవుడ్‌లో రిలీజైన ఈ చిత్రం.. ఫస్ట్‌ షో నుంచే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. ఫలితంగా తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. ఒక్క రోజే రూ.5 కోట్ల గ్రాస్‌ వసూళ్లని రాబట్టినట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి తెలుగులో రూ.2 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.114 కోట్ల షేర్‌ వసూళ్లని రాబట్టి రికార్డుని సృష్టించింది. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరాంగదుర్‌ నిర్మించారు.
 

Videos

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Photos

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)